ప్రశాంతంగా ముగిసిన పోలింగ్


Tue,January 22, 2019 12:10 AM

-చేర్యాలలో 89.31 శాతం పోలింగ్ నమోదు
- కొమురవెల్లిలో 95.90 శాతం
- చిట్యాల కేంద్రాన్ని సందర్శించినకలెక్టర్ కృష్ణ భాస్కర్
చేర్యాల, నమస్తే తెలంగాణ : మొదటి విడుతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో సో మవారం ప్రశాంతంగా ముగిశాయి. చేర్యాల మండలంలో 89.31, కొమురవెల్లి మండలంలో 95.90 ఓటింగ్ శాతం నమోదైంది. రెండు మండలాల్లో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఉత్సాంగా ఓట్లు వేశారు. చేర్యాల మండలంలోని చిట్యాల, దానంపల్లి గ్రామాల పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ కృష్ణభాస్కర్ సందర్శించారు. అలాగే కడవేర్గు, ఆకునూరు పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ సందర్శించారు. ఆకునూరులో సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. కొమురవెల్లి మండలంలోని ఐనాపూర్ పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు దినకర్ సందర్శించారు.
చేర్యాలలో పోలింగ్ శాతం
మండలంలోని 17 గ్రామాల్లో నమోదైన పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. ముస్త్యాలలో 85.47, వీరన్నపేటలో 88.90, చుంచనకోటలో 91.32, కొత్తదొమ్మాటలో92.87, ఆకునూరులో 86.24, కాశెగుడిసెలలో 79.61, రాంపూర్ 92.80, గుర్జకుంటలో 87.96, పాత దొమ్మాటలో 83.90, తాడూరులో 94.19, చిట్యాలలో 88.74, దానంపల్లిలో 96.59, కడవేర్గులో 87.74, పోతిరెడ్డిపల్లిలో 94.21,వేచరేణిలో 92.59, పెదరాజుపేటలో 89.25, నాగపురిలో 89.25 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
కొమురవెల్లిలో పోలింగ్ శాతం..
మండల వ్యాప్తంగా గ్రామాల్లో నమోదైన పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. లెనిన్ 97.74, మర్రిముచ్చాల 92.92, కిష్టంపేట 92.11, కొమురవెల్లిలో 88.56, ఐనాపూర్ 88.05, తపాస్ 94.95, పోసాన్ 92.73, గురువన్నపేటలో 95.99, రాంసాగర్ 93.97 పోలింగ్ శాతం నమోదైంది.

142
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...