ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు


Mon,January 21, 2019 11:52 PM

దుబ్బాక, నమస్తే తెలంగాణ: నియోజకవర్గంలో తొలివిడుతలో జరిగిన మూడు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగింది. గ్రామాల్లో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివచ్చారు. సమస్యాత్మక గ్రామాలైన మిరుదొడ్డి, పెద్దగుండవెళ్లి గ్రామపంచాయతీ పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును భారీగా ఏర్పాటు చేశారు. దుబ్బాక సర్కిల్ పరిధిలో ఎలాంటి గొడవలు జరుగుకుండా ఉండేందుకు అధికారులు, పోలీసులు ముందస్తుగా చర్యలు చేపట్టడంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వందమీటర్ల దూరంలో అభ్యర్థులను, వారి అనుచరులు ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గ్రామాలలో నడువలేని ఓటర్లను(వృద్దులను, వికలాంగులను) వాహనాలలో పోలింగ్ వద్దకు తీసుకవచ్చారు. పలుచోట్ల పోలింగ్ వృద్దులకు ఓటు వేసేందుకు పోలీసులు, సిబ్బంది సహాయపడ్డారు. దుబ్బాక మండలం అప్పనపల్లి, పెద్దగుండవెళ్లి పోలింగ్ కేంద్రాలను జేసీ పద్మాకర్ పరిశీలించారు.
ఓటు వేసిన ప్రముఖులు...
దుబ్బాక మండలం పోతారం గ్రామంలో ఎంపీ కొత్త ప్రభాకర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డితో కలిసివచ్చిన ఎంపీ కొత్త ప్రభాకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఎంపీ సతీమణి మంజులత, కుమారుడు పృథ్వి ఓటు వేశారు. చిట్టాపూర్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సతీమణి సుజాత, తనయుడు సతీశ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దుబ్బాక ఎంపీపీ ర్యాకం పద్మాశ్రీరాములు దంపతులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తొగుట మండలం తుక్కాపూర్ మాజీమంత్రి టీఆర్ నాయకుడు చెరకు ముత్యంరెడ్డి, ఆయన తనయుడు శ్రీనివాస్ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...