ఓటర్లను ప్రలోభపెడితే సమాచారం ఇవ్వండి


Sun,January 20, 2019 11:30 PM

సిద్దిపేట టౌన్ : పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్ అన్నారు. మొదటి విడుత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలీసులకు ఆదివారం ఆయన సూచనలు అందజేశారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. పోలీసులు జిల్లా అధికారులతో సమన్వయంతో కలిసి ఎన్నికల విధుల్లో పాల్గొనాలన్నారు. ఇన్సిడెంట్‌ఫ్రీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. పోలింగ్ లొకేషన్లను జియోట్యాగింగ్ పూర్తి చేయ డం జరిగిందని ఆయన వివరించారు. గ్రామాల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. గొడవలు సృష్టించే వ్యక్తులను గుర్తించి వారి కదలికలపై నిఘా పెట్టాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే విధంగా ఎవరైనా పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారికి సంబంధించిన వ్యక్తులు ఓటు వేయమని ప్రజలను ఇబ్బందికి గురి చేసిన, డబ్బులు చూపి ప్రలోభపెట్టిన, మద్యం, డబ్బులు, వస్తువులు ఓటర్లకు సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో ఘర్షణలకు, నేరపూరిత చర్యలకు దిగిన, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఏ సంఘటన జరిగిన వెంటనే గ్రామ ప్రజలు, యువకులు స్పందించి కమిషనరేట్ వాట్సాప్ నంబరు 7901100100 లేదా డయల్ యువర్ 100కు ఫోన్ చేసి తెలుపాలన్నారు.

567 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు..
సిద్దిపేట డివిజన్‌లో మొదటి విడుతలో భాగంగా సోమవారం జరిగే పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని సీపీ జోయల్ డెవిస్ అన్నారు. డీసీపీలు 3, ఏసీపీలు 6, సీఐలు 17, ఎస్‌ఐలు 30, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు 425, ఆర్మ్‌డ్ రిజర్వ్ అధికారులు, సిబ్బంది 57, హోంగార్డులు 70, మొబైల్ పార్టీ పోలీసులు 36, ఫ్లయింగ్ స్కాడ్స్ 9, ఎస్‌ఎస్‌టీమ్స్ 2, ైస్ట్రెకింగ్ ఫోర్స్ 9, స్పెషల్ ైస్ట్రెకింగ్ ఫోర్స్ 3 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు పోలీసులకు సహకరించాలన్నారు.

పటిష్ట భద్రత మధ్య బ్యాలెట్ బాక్సుల తరలింపు
జిల్లాలో మొదటి విడుత పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని సీపీ అన్నారు. సోమవారం సిద్దిపేట డివిజన్‌లోని సిద్దిపేట రూరల్, అర్బన్, నంగునూరు, చిన్నకోడూరు, మిరుదొడ్డి, తొగుట, దుబ్బాక, చేర్యాల, కొమురవెల్లిలో మొదటి విడుత పోలింగ్ జరుగనున్నది. ఇందుకోసం ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సామగ్రి తరలించేందుకు పోలీసులతో పటిష్ట బందోబస్తు నిర్వహించామన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...