రేపే తొలి దశ


Sat,January 19, 2019 11:44 PM

-గ్రామ పంచాయతీ తొలి విడుత ఎన్నికలకు సర్వం సిద్ధం
-171 గ్రామాల్లో 1575 పోలింగ్ కేంద్రాలు
-10 సమస్యాత్మక గ్రామాలుగా గుర్తింపు
-మిరుదొడ్డి, కడవేర్గులో వెబ్
-సోమవారం ఉదయం 7 నుంచి 1 గంటవరకు పోలింగ్
-మధ్యాహ్నం 2 గంటల తర్వాత లెక్కింపు
సిద్దిపేట ప్రతినిధి, నమస్తేతెలంగాణ: గ్రామ పంచాయతీ తొలి విడుత ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మొదటి విడుతలో సిద్దిపేట డివిజన్ తొమ్మిది మండలాల్లోని 171 గ్రామాల్లో సోమవారం పోలింగ్ జరుగనున్నది. సర్పంచ్ స్థానాలకు 697 మంది, వార్డు స్థానాలకు 3,776 మంది బరిలో ఉండగా, 1575 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు చోట్ల వెబ్ 10 గ్రామాల్లోని 114 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. తొలి విడుత ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ చెప్పారు.

జిల్లాలోని 22 మండలాల్లోని 499 పంచాయతీలకు మూడు విడుతల్లో ఎన్నికలను నిర్వహిస్తున్నారు. సిద్దిపేట డివిజన్ తొలి విడతలో, గజ్వేల్ డివిజన్ రెండో విడుత, హుస్నాబాద్ డివిజన్ మూడో విడుతలో ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. తొలి విడుతలో సిద్దిపేట డివిజన్ సిద్దిపేట అర్బన్, రూరల్, చిన్నకోడూరు, నంగునూరు, దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట్ట, చేర్యాల, కొమురవెల్లి మండలాలు ఉన్నాయి. ఈ డివిజన్ 186 జీపీలు, 1712 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా, నామినేషన్ల ఉపసంహరణ అనంతరం సిద్దిపేట రూరల్ మండలంలో 6, అర్బన్ మండలంలో 2, నంగునూరు మండలంలో 3, చిన్నకోడూరు మండలంలో 1, దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక మండలంలో 1, మిరుదొడ్డి మండలంలో 2, తొగుట మండలంలో 3, జనగామ నియోజకవర్గంలోని చేర్యాల మండలంలో 1, కొమురవెల్లి మండలంలో 2 మొత్తం 21 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. 1712 వార్డులకు గానూ 317 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

1,575 పోలింగ్ కేంద్రాలు
డివిజన్ తొమ్మిది మండలాల్లోని 186 గ్రామ పంచాయతీలల్లో 15 జీపీలు పూర్తిస్థాయిలో ఏకగ్రీవం కాగా, ఆరు పంచాయతీల్లో సర్పంచ్ కొన్ని వార్డు స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో తొలి విడుత 171 గ్రామాల్లో 1,575 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 165 సర్పంచ్ స్థానాలకు 697 మంది అభ్యర్థులు, 1,395 వార్డు స్థానాలకు 3,776 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణలో ఆర్ 70మంది, స్టేజీ-2 అధికారులు 171 మంది, జోనల్ ఆఫీసర్- 29 మంది, రూట్ ఆఫీసర్-44 మంది, పీవోలు-2112మంది(10శాతం రిజర్వుడ్), ఓపీవోలు 2194 (15శాతం రిజర్వుడ్) మంది పాల్గొంటున్నారు.

మిరుదొడ్డి, కడవేర్గులో వెబ్
తొలి విడుత ఎన్నికలు జరిగే మిరుదొడ్డితో పాటు చేర్యాల మండలం కడవేర్గు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఈ రెండు గ్రామాల్లో 26 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తంగా 21 మందిని మైక్రో అబ్జర్వర్ నియమించారు. ఎనిమిది ైఫ్లెయింగ్ స్వాడ్స్ బృందాలు, స్టాటిక్ సర్వేలైన్స్ టీంలను ప్రతి మండలానికి ఏర్పాటు చేశారు. తొమ్మిది మండలాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 3వేల జనాభాకు పైబడి ఉన్న గ్రామాలు 22, రెండు వేల పైబడి జనాభా ఉన్న గ్రామాలు 66 ఉన్నాయి. మిగతావి 2వేల లోపు జనాభా ఉన్న గ్రామాలు. తొలి విడుత జరిగే గ్రామాల్లో మొత్తంగా 2,43,768 ఓటర్లున్నారు.

10 గ్రామాలు సమస్యాత్మకం
పది గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. ఈ గ్రామాల్లో 114 పోలింగ్ కేంద్రాలున్నాయి. సిద్దిపేట రూరల్ మండలం నారాయణరావుపేటలో 12 కేంద్రాలు, చిన్నకోడూరు మండలం గంగాపూరులో 10, నంగునూరు మండలం నర్మెటలో 10, దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో 12, మిరుదొడ్డిలో 14, తొగుట మండలం ఘన్ 10, వెంకట్రావ్ 10, చేర్యాల మండలం ఆకునూరులో12, కడవేర్గులో 12, కొమురవెల్లి మండలం ఐనాపూరులో 12 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.

140
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...