కొనసాగుతున్న కంటి పరీక్షలు


Sat,January 19, 2019 11:41 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ : ప్రజల్లో కంటి చూపు సమస్య నివారణ కోసం టీఆర్ సర్కారు ప్రారంభించిన కంటి వెలుగు పథకం చేర్యాల, మద్దూరు మండలాలలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. మండలంలోని నాగపురి గ్రామంలో శనివారం కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 210 మందికి పరీక్షలు నిర్వహించి, 65 మందికి కండ్లద్దాలను అందించి, 30 మందిని ఆపరేషన్ కోసం రెఫర్ చేసినట్లు వైద్యు డు వీరబత్తిని సత్యనారాయణ తెలిపారు. మద్దూరు మండలంలోని కొండాపూర్ గ్రామ శిబిరంలో 189 మందికి పరీక్షలు నిర్వహించి, 34 మందికి కండ్లద్దాలను అందించడంతోపాటు 12 మందిని ఆపరేషన్లకు రెఫర్ చేసినట్లు వైద్యుడు శ్రీనాథ్ తెలిపారు. కార్యక్రమాల్లో వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...