భక్తులకు అన్ని ఏర్పాట్లు..


Sat,January 19, 2019 11:40 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ : కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలకు తరలివస్తున్న భక్తులకు అన్ని విధాలుగా సేవలందించడమే తమ ధ్యేయ మని ఆలయ చైర్మన్ సెవెల్లి సంపత్ అన్నారు. శనివారం ఆలయంలో ఆలయ డీసీ టి.వెంకటేశ్, పాలక మండలి సభ్యులు ఉడుత మల్లేశ్ ముత్యం నర్సింహులు, బాలేశ్ కలిసి విలేకరుల సమావేశాన్ని చైర్మన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వారి క్షేత్రం లో భక్తుల నుంచి అక్రమ వసూళ్లకు ఎవరూ పాల్పడిన చర్య లు తప్పవని హెచ్చరించారు. స్వామివారి పట్నం వారానికి వస్తున్న భక్తుల కోసం నీటి వసతితోపాటు పార్కింగ్ సదుపా యం కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే, క్యూలైన్లలో నీటి వసతి కల్పించి త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

అలాగే, పాలక మండలి సభ్యులు పలు ప్రదేశాల్లో ఉత్సవాలు పూర్తయ్యే వరకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు మొక్కులు రూపంలో చెల్లించే కోరమీసా లను వెండి పరిమాణం సరైన పద్ధ్దతిలో ఉండే విధంగా ఆదే శాలు జారీ చేసినట్లు తెలిపారు. రోజురోజు వారీగా కోనేటిలోని నీటి తొలగించి ఎప్పటికప్పుడు కొత్త నీటిని కోనేరుకు వచ్చే ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశామని, పారిశుధ్య పనుల నిర్వహణ ఏర్పాట్లపై ప్రత్యేకశ్రద్ధ వహిస్తున్నట్లు పేర్కొ న్నారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయించామని, గుట్టపై ఉన్న ఎల్లమ్మ ఆలయం వద్ద అన్నివసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొబ్బరికాయాలను అధిక ధరలకు విక్రయిస్తే చర్య లు తప్పవని, అలాగే, పార్కింగ్ పేరిట వసూళ్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన కోరారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...