ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష


Sat,January 19, 2019 11:40 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ: మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ భాగంగా పోలీస్ అధికారులు నిర్వహించాల్సిన విధులను క్షుణ్ణంగా తెలిసి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. శనివారం మొదటి విడుత పంచాయతీ ఎన్నికలు జరుగునున్న సిద్దిపేట డివిజన్ పరిధిలోని వివిధ మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్, జేసీ పద్మాకర్, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ కలిసి కలెక్టర్ కృష్ణభాస్కర్ మాట్లాడుతూ పోలింగ్ రోజు అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించాల్సిన విధులు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఏ మండలాల్లో ఎన్ని పోలింగ్ కేంద్రాలున్నాయి..ఎన్నికల సామగ్రి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయా..లేదా చూడాలని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ సూచించారు. దుబ్బాక, మిరుదొడ్డి, సిద్దిపేట అర్బన్, రూరల్ మండలాలతోపాటు చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో ఏర్పాటు చేయాల్సిన రవాణా సదుపాయాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏసీపీ రామేశ్వర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...