పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి


Thu,January 17, 2019 11:49 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులపై ఉందని కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం సిద్దిపేట, గజ్వేల్ రెవెన్యూ డివిజన్‌ల పరిధిలో మొదటి, రెండు విడుతల్లో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్‌ను అధికారులకు అందించడంపై కలెక్టర్ అభినందించారు. పీవో, ఏపీవోలు ఎన్నికలు జరుగుతున్న సమయంలో శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమైతే అప్రమత్తంగా వ్యవహరించి ఎన్నికలు నిర్వహించాలన్నారు. దేశంలోని 7,8 రకాల ఎన్నికల్లో అతి కష్టమైనవి గ్రామ పంచాయతీ ఎన్నికలు అని వాటి నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు కీలకం కానున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి నిర్వహించాలన్నారు. జిల్లా అధికార యంత్రాంగం మీ వెనుక ఉందని, ప్రతి బూత్‌లోను పీవో, ఏపీవోలు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల కమిషన్‌కు మీకు వారధిగా మేముంటామని భరోసానిచ్చారు. దుబ్బాక నియోజకవర్గంలోని చీకోడు స్కూల్ అసిస్టెంట్ శ్రీహరి జిల్లా యంత్రాంగం తరఫున వారికి కావాల్సిన సదుపాయాల కల్పనకు దృష్టి సారించాలన్నారు. చేర్యాల స్కూల్ అసిస్టెంట్ బాబు పోలింగ్ సిబ్బంది 200 మంది వరకే ఉన్న అంశాన్ని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్దేశిత ప్రతిపాదనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ వారికి వివరించారు. పోస్టల్ బ్యాలెట్‌లో అరమార్కు బదులుగా స్వస్తిక్ గుర్తు వాడాలని, విద్యావంతుల ఓట్లు ఎవరికీ వేస్తున్నామో స్పష్టం తెలుస్తుందన్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు రమేశ్‌రావు, ఎంపీడీవో సమ్మిరెడ్డి, పీవో, ఏపీవోలు పాల్గొన్నారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...