ఎన్నికలపై కలెక్టర్ సమీక్ష


Thu,January 17, 2019 11:48 PM

సిద్దిపేట అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అదనపు జిల్లా ఎన్నికల అధికారులను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశించారు. సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని ఆయన చాంబర్‌లో గురువారం రాత్రి ఎన్నికల సహాయ అధికారి సిద్దిపేట ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీపీవో సురేశ్‌బాబు, అడిషనల్ ఎన్నికల సహాయ అధికారులు, ఎంపీడీవోలతో ఈ నెల 21తేదీన జిల్లాలో మొదటి విడుత సిద్దిపేట రెవెన్యూ డివిజన్‌లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లను మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా కావాల్సిన సిబ్బంది వివరాలను ఆరా తీశారు. ఈ మేరకు దుబ్బాక, చేర్యాల, మండలాల్లో సిబ్బంది కొరత ఉన్నదని, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు కొంత ఆలస్యం ఏర్పడుతుందని, రేపటి లోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆయా మండలాల ఎన్నికల అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. సమీక్షలో ట్రైనీ డీపీవో నరేశ్, మండలాల ఎంపీడీవోలు సమ్మిరెడ్డి, లక్ష్మణ్‌రావు, సత్యశ్రీ, నాగేశ్వర్‌రావు, మల్లికార్జున్ పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...