ప్రతి గ్రామపంచాయతీకి ఒక నర్సరీ తప్పని సరి


Thu,January 17, 2019 11:48 PM

సిద్దిపేట అర్బన్: రైతులు నివాస పరిసర ప్రాం తాల్లో నాటేందుకు అవసరమైన మొక్కలను ఆ గ్రామ పరిధిలోని నర్సరీల్లో విధంగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ ఏపీవోలను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా పల్లెలు, పట్టణాల్లో విరివిగా మొక్కలు నాటిస్తుండగా, దీనిని ఉద్యమంగా కొనసాగించేందుకు ప్రతి గ్రామ పంచాయతీల్లో నర్సరీల ఏర్పాట్లు చేయాలని ఏపీవోలకు దిశా నిర్దేశం చేశారు. పాత పంచాయతీలతో పాటు కొత్త గ్రామ పంచాయతీల్లోనూ మొక్కలు పెంచేందుకు సన్నాహాలు చేయాలని సూచనలు చేశారు. సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం డీఆర్డీఏ పీడీ నవీన్, అడిషనల్ డీఆర్డీ శ్రీనివాస్, ఏపీవో, ఏపీఎంలతో గ్రామ పంచాయతీ నర్సరీ, స్వచ్ఛభారత్ మిషన్ అంశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పూలు, పండ్ల మొక్కలతోపాటు ప్రజలకు అవసరమైన మొక్కల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సరీలు మొక్కలు పొందే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.

పం చాయతీరాజ్ నూతన చట్టం ప్రకారం ప్రతి గ్రామం లో నర్సరీ ఏర్పాటు బాధ్యతను గ్రామీణాభివృద్ధి సంస్థ అటవీ శాఖలకు అప్పగించిందని వివరిస్తూ జిల్లాలోని 499 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు కోసం 412 లక్షల సీడింగ్ లక్ష్యంగా డీఆర్డీఏ 291 లక్షల వరకు లక్ష్యాలను ప్రణాళికగా పెట్టుకున్నట్లు డీఆర్డీఏ పీడీ నవీన్ వివరించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 370 గ్రామ పంచాయతీలకు 291 లక్ష్యం కాగా, ఇప్పటికే 289.1 లక్షల నర్సరీల్లో పెంచే మొక్కలకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. అలాగే 370 గ్రామ పంచాయతీలకు గాను 355 గ్రామ పంచాయతీల్లో నర్సరీలకు అనుకూలమైన నేల ఉండేలా ఎంపిక పూర్తి చేశామని, ఆయా నర్సరీల్లో కావాల్సిన మౌలిక వసతులు, నీటి ట్యాంకులు, పైప్‌లైన్లు కల్పించామన్నారు. అలాగే వన సేవకులకు శిక్షణ ఇస్తున్నట్లు డీఆర్డీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు కీలక అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన ఏపీవోలు, ఏపీఎంలు పాల్గొన్నారు.

స్వచ్ఛ సుందర్ శౌచాలయ్ నిర్మాణాలలో ప్రథమ స్థానంలో నిలువాలి
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛసుందర్ శౌచాలయ్ నిర్మాణాలు చేపట్టడంలో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలువడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ ఏపీఎం, ఏపీవోలకు సూచించారు. సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం రాత్రి డీఆర్డీఏ పీడీ నవీన్, అడిషనల్ డీఆర్డీఏ శ్రీనివాస్‌లతో హరితహారం, స్వచ్ఛసుందర్ శౌచాలయ్ నిర్మాణాల అంశాలపై సమీక్ష జరిపారు. నిర్మాణాల ప్రగతిపై ఆరా తీశారు. జిల్లాలో 405 గ్రామ పంచాయతీలకు 1లక్షా 74 వేల 100 నివాసాలు ఉన్నాయని, 5208 మా త్రమే స్వచ్ఛ సుందర్ శౌచాలయ్ నిర్మానాలు చేయగా, ఇంకా 1 లక్షా 68 వేల 892 చేపట్టాల్సి ఉన్నదని వాటిని ఏ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని నిర్ణయించారో మండలాల వారీగా ఏపీవో, ఏపీఎంలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై స్వచ్ఛ భారత్ మిషన్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛ సుందర్ శౌచాలయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మరుగుదొడ్లను నిర్మించడమే కాకుండా ఉపయోగించుకునేలా గ్రామీణ ప్రాంత ప్రజల్లో చైతన్యం తేవాలని అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ నవీన్, వివిధ మండలాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...