క్వార్టర్స్ ఫైనల్‌లో తెలంగాణ జట్లు


Mon,January 14, 2019 11:36 PM

-మూడో రోజూ ఉత్సాహభరితంగాజాతీయ స్థాయి హ్యాండ్ పోటీలు
-ప్రీక్వార్టర్స్‌లో సత్తా చాటిన బాల, బాలికల జట్లు
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : సిద్దిపేట మినీ స్టేడియంలో జరుగుతున్న 64వ జాతీయ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పో టీలు మూడోరోజు సోమవారం హోరాహోరీగా సాగాయి. బా లురు, బాలికల విభాగంలో 8 జట్లు ప్రీక్వార్టర్స్ చేరుకున్నాయి. సోమవారం జరిగిన పోటీలను మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ప్రముఖ పౌల్ట్రీ వ్యాపారవేత్త భూసాని శ్రీనివాస్, ఓఎస్డీ బాల్‌రాజు, ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ సుజాత, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్, జిల్లా కార్యదర్శి మల్లేశంతోపాటు పెట అధ్యక్షుడు సతీశ్ మ్యాచ్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మాట్లాడుతూ.. సిద్దిపేటలో జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీ లు జరగడం సంతోషకరమన్నారు. తెలంగాణ బాలురు, బాలికల జట్లు ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నాయి. ప్రీక్వార్టర్స్‌లో చేరుకున్న బాలుర జట్లలో ఆంధ్రప్రదేశ్, జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, పుదుచ్చేరి, గుజరాత్ ఉన్నాయి. అలాగే, బాలికల జట్లలో ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, చండీగఢ్, ఢిల్లీ, వెస్ట్‌బెంగాల్, బీహార్, రాజస్థాన్ జట్లు ఉన్నాయి. మూడో రోజు పోటీల్లో బాలికల విభాగం లో తమిళనాడు.. ఛత్తీస్‌గఢ్‌పై 13-11 గోల్స్‌తో, ఉత్తర్‌ప్రదేశ్.. మధ్యప్రదేశ్‌పై 19-5, ఛత్తీస్‌గఢ్... సీబీఎస్‌ఈఎన్‌ఎస్‌వోపై 18-1, మణిపూర్.. గోవాపై 10-2, పంజాబ్‌పై బీహార్ 7-8 గోల్స్‌తో విజయం సాధించాయి. బాలుర విభాగంలో విద్యాభారతి పాండిచ్చేరిపై 15-17, జమ్ముకశ్మీర్ ఉత్తరాఖండ్‌పై 10-29, తమిళనాడు మణిపూర్‌పై 20-28, కేరళ.. మహారాష్ట్రపై 23-21, ఉత్తరఖండ్.. దాద్రానగర్‌హవేళిపై 0-12, బీహార్.. చత్తీస్‌గఢ్‌పై 10-16 తేడాతో విజయం సాధించాయి.

- ప్రీ క్వార్టర్స్‌లో గెలుపొందిన జట్లు
ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్న 8 జట్లకు 3 మ్యాచ్‌లు నిర్వహించారు. బాలురు విభాగంలో జమ్ముకశ్మీర్.. ఒడిశాపై 23-15, ఆంధ్రప్రదేశ్.. మధ్యప్రదేశ్‌పై 25-18, తెలంగాణ.. తమిళనాడుపై 39-17 తేడాతో గెలిచి క్వార్టర్స్ ఫైనల్‌లో అడుగు పెట్టాయి. బాలికల విభాగంలో 2 మ్యాచ్‌లు జరుగగా తెలంగాణ.. పం జాబ్‌పై 14-6, కేరళ.. ఒడిశాపై 3-17 తేడాతో గెలిచాయి.
పోటీలను జాతీయ పరిశీలకుడు వికేశ్‌కొశ్వా, రాష్ట్ర పరిశీలకుడు జగన్‌మోహన్‌రావు, పీఈటీలు వెంకటస్వామి, కనకయ్య, లక్ష్మ ణ్, రామేశ్వర్‌రెడ్డి, ఉప్పలయ్య, అక్బర్‌లు పరిశీలించారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...