హోరాహోరీగా జాతీయ స్థాయి హ్యాండ్ పోటీలు


Sun,January 13, 2019 11:43 PM

-పోటీ పడిన 40 జట్లు
-ముఖ్య అతిథిగా హాజరైన ద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ దంపతులు
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : 64వ జాతీయ స్థాయి హ్యాండ్ పోటీలు రెండవ రోజు రసవత్తరంగా కొనసాగాయి. పోటీలను సీపీ జోయల్ డెవిస్ దంపతులు ప్రారంభించారు. అనంతరం హ్యాండ్ మ్యాచ్ వీక్షించారు. ఆయా జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆధ్యాంతం మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగాయి. ఈ పోటీలను డీఈవో రవికాంత్ ఎస్ సెక్రటరీ సుజాత, హ్యాండ్ అసొసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్ జిల్లా కార్యదర్శి మల్లేశంతో పాటు పెట అధ్యక్షుడు సతీష్ తదితరులు ప్రారంభించారు. ఆదివారం 40 జట్లు పోటీ పడగా 14 బాలుర జట్లు, 26 బాలికల జట్లు పోటీ పడ్డాయి.
హోరాహోరీగా క్రీడాపోటీలు..
బాలుర విభాగంలో గోవాపై హర్యానా జట్టు 16 -7 గోల్స్ ఎన్వీఎస్ రాజస్థాన్ 16 - 28, కర్ణాటకపై మధ్యప్రదేశ్ 19 - 17, ఉత్తర్ జమ్ముకాశ్వీర్ 14-16, తమిళనాడుపై పుదుచ్చేరి 19-18, వెస్ట్ ఒడిస్సా 20-16, సీబీఎస్ జార్ఖండ్ 9-6, చండీఘర్ పంజాబ్ 30-20, కర్ణాటకపై గుజరాత్ 29-14, ఐపీఎస్ మధ్యప్రదేశ్ 6-18, గోవాపై చండీఘర్ 23-13, బీహార్ కేరళ 14-13, బాలికల విభాగంలో ఏపీపై మహారాష్ట్ర 6-12, గోవాపై బీహార్ 15-1, ఉత్తరఖండ్ కర్ణాటక 10-12, జమ్ముకాశ్వీర్ ఒడిశా 11-2, త్రిపురపై రాజస్థాన్ 6-18, ఎన్వీఎస్ వెస్ట్ 2-16 గెలుపొందాయి.
పోటీలను జాతీయ పరిశీలకుడు వికేశ్ రాష్ట్ర పరిశీలకుడు జగన్ పీఈటీలు వెంకటస్వామి, కనకయ్య, లక్ష్మణ్, రామేశ్వర్ ఉప్పలయ్య, అక్బర్ పరిశీలించారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...