ధాన్యం కొనుగోళ్లు


Thu,December 13, 2018 11:22 PM

గజ్వేల్‌రూరల్: ఆన్‌లైన్ పద్ధతిలో ధాన్యం కొనుగోలు చేయడం, తిరిగి రైతులకు ఆన్‌లైన్‌లోనే డబ్బుల చెల్లింపు విధానం చాలా బాగుందని పంజాబ్ రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ అనిందిత మిత్ర అన్నారు. గురువారం గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ద్వారా ధాన్యం కొనుగోళ్లను ఆమె పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ పద్మాకర్, పౌరసరఫరాల శాఖ జాయింట్ కమిషనర్ చంద్రప్రసాద్, జనరల్ మేనేజర్ లక్ష్మీనారాయణలు పంజాబ్ అధికారుల బృందానికి ధాన్యం, పత్తి, ఇతర పంటల కొనుగోళ్ల గురించి క్షుణ్ణంగా వివరించారు. కాగా పంజాబ్ పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ అనిందిత మిత్ర ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులలో నమోదు చేసిన వివరాలను పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ధాన్యానికి ఏవిధంగా ధరను నిర్ణయిస్తున్నారో కూడా అడిగి తెలుసుకున్నారు. అలాగే మార్కెట్‌యార్డులోని సివిల్ సప్లయి గోదాంను ఆమె పరిశీలించి నిర్వహణపై పలు ప్రశ్నలు వేసి సమాచారాన్ని తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతుల నుంచి ధా కొనుగోలు చేయడం, వారికి తిరిగి డబ్బులు చెల్లించడం ఆన్‌లైన్ పద్ధతిలో చాలా బాగా జరుగుతుందన్నారు. గజ్వేల్‌లోని సమీకృత మార్కెట్‌ను సందర్శించిన అనిందిత మిత్ర మార్కెట్‌లో కూరగాయల, మాంసం వ్యాపారులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను జేసీ పద్మాకర్, మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్‌లను అడిగి తెలుసుకున్నారు. సమీకృత మార్కెట్ అన్ని సౌకర్యాలతో చాలా బాగా నిర్మించారని కితాబునిచ్చారు. పం రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ అనిందిత మిత్ర వెంట ఫైనాన్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ సర్వేష్‌కుమార్, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అంజుమన్ భాస్కర్‌లు ఉ కార్యక్రమంలో డీఎస్‌వో వెంకటేశ్వర్లు, ఏఎంసీ కార్యదర్శి శ్రీనివాస్, ఆర్‌ఐ స్పందన, ఏసీపీ నారాయణ, సీఐ తదితరులున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన పంజాబ్‌అధికారుల బృందం
కొమురవెల్లి : మండలంలోని ఐనాపూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం పంజాబ్ సివిల్ సప్లయి మెనే డైరెక్టర్ ఆనందితమిత్ర(ఐఏఎస్) నేతృత్వంలో పలువురు పంజాబ్ సివీల్ సప్లయి అధికారులు సిద్దిపేట జాయింట్ కలెక్టర్ పద్మాకర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా అ ఉన్న ఐకేపీ సిబ్బంది కొనుగోలు కేంద్రాన్ని ఏ విధంగా నడుపుతున్నారో దగ్గరుండి పరిశీలించడంతో పాటు వారితో కాసేపు ముచ్చాటించారు. కార్యక్రమంలో వారి వెంట పంజాబ్ సివిల్ సప్లయి ఆసిస్టెంట్ కమిషనర్ వాణిభవానీ, సివిల్ సప్లయి జాయింట్ కమిషనర్ చంద్రప్రకాశ్, సివిల్ సప్లయి జనరల్ మేనేజర్ లక్ష్మీనారాయణ, పంజాబ్ లైజేన్ డిప్యూటీ తహసీల్దార్ తుక్షనాయక్, సిద్దిపేట ్ల డీఆర్‌డీఏ పీడీ నవీన్‌కుమార్, డీఎస్‌వో వెంకటేశ్వర్లు,తదితరులున్నారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...