పోలింగ్ బూత్‌ల వారీగా ఈవీఎంల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి


Wed,December 5, 2018 11:30 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పట్టణ శివారులోని కరీంనగర్ రోడ్డులో గల తెలంగాణ మోడల్ స్కూల్‌లో స్ట్రాంగ్‌రూమ్ ఏర్పాటు చేసి ఈవీఎంలను భద్రపరిచారు. 7వ తేదీన ఎన్నికల పోలింగ్ ఉన్నందున ఒక రోజు ముందే ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలను పంపిణీ చేయాల్సి ఉంటుంది. మొత్తం 292పోలింగ్ బూత్‌లకు గాను ఒక్కో బూత్‌కు 4గురు చొప్పున అధికారులను నియమించారు. వీరు ఈవీఎంలను తీసుకొని వారికి కేటాయించిన పోలింగ్ బూత్‌కు గురువారం రాత్రి వరకు చేరుకోవాలి. కాబట్టి గురువారం ఉదయం నుంచే ఈవీఎంల కోసం పోలింగ్ అధికారులు మోడల్ స్కూల్‌కు వస్తుంటారు. కాగా ఈవీఎంల పంపిణీకి చేసిన ఏర్పాట్లను జనరల్ అబ్జర్వర్ డీఎస్ గాద్వీ బుధవారం సాయంత్రం పర్యవేక్షించారు. ఇక్కడికి వచ్చే అధికారులు, సిబ్బందికి సరిపడా ఏర్పాట్లుచేయాలని సూచించారు. 7వ తేదీన ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ ఉంటున్నందున పోలింగ్ అధికారులు, సిబ్బంది విధిగా గురువారం సాయంత్రం వరకు పోలింగ్ బూత్‌కు వెళ్లి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి అనంతరెడ్డి, ఏఆర్‌వో దశరథ్‌సింగ్ రాథోడ్, స్థానిక అధికారులు ఉన్నారు.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...