మాయా కూటమిని ప్రజలు నమ్మొద్దు


Tue,November 20, 2018 12:42 AM

మిరుదొడ్డి : మోసపూరిత మాయమాటలను చెప్పే మాయా కూటమిని నేడు ప్రజలు నమ్మె పరిస్థితుల్లో లేరని టీఆర్‌ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన మిరుదొడ్డిలో బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ కన్వీనర్ సత్తు రాజిరెడ్డి, బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి శోభా రాణి, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చల్లూరి మల్లేశం, తిరుపతి రెడ్డి, ఎల్లారెడ్డితో పాటు హమాలీ సంఘం కూలీలు సుమారు రెండు వందల మంది సోలిపేట రామలింగారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సోలిపేట మాట్లాడుతూ..టీఆర్‌ఎస్ పార్టీ వాహనమైతే ..దానిని నడిపేది మాత్రం మంచి మనసున్న నికార్సైన కల్మశం లేని టీఆర్‌ఎస్ కార్యకర్తలేనన్నారు. ఇతర పార్టీల నేతలు ఐదేండ్ల కొక్కసారి గ్రామాల్లోకి వచ్చి ఎన్నికలు పూర్తి కాగానే తమ ముఖాలను చాటేసి మళ్లీ ప్రజలను పలకరించిన పాపాన పోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రజలకు ఏ ఆపద వచ్చినా ముందుండి చూసుకునేది మాత్రం టీఆర్‌ఎస్ శ్రేణులే అని పేర్కొన్నారు. దాదాపుగా ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీ విజయం ఖరారు కాగా అత్యధికగా మెజార్టీ రావడం కోసం పార్టీ కృషి చేస్తుందన్నారు.

ఐక్యరాజ్య సమితిలో సీఎం కేసీఆర్‌కు అవార్డు
ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా రైతుల కొరకు ప్రవేశ పెట్టని రైతు బీమా, రైతు బంధు పథకాలను దేశంలో రాష్ట్రంలో మాత్రమే ఈ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని స్వయంగా ఐక్యరాజ్య సమితే గుర్తించి సీఎం కేసీఆర్‌కు అవార్డును ప్రకటించిందని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల బాగోగుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత పంజాల శ్రీనివాస్ గౌడ్, జడ్పీటీసీ లింగాల జయమ్మ బాల్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ నంట బాపురెడ్డి, పార్టీ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు వెంకట్‌రెడ్డి, భూపతిగౌడ్, ఎంపీటీసీలు స్వామి, బైరయ్య, సోమేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్, ఆయా గ్రామాల పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

రాయపోల్‌లో...
రాయపోల్ : మండలంలోని తిమ్మక్కపల్లి గ్రామానికి చెందిన యుత్ కాంగ్రెస్ కార్యకర్తలు, యవకులు సోలిపేట సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. గ్రామ యూత్ నాయకుడు కొంగరి దయాకర్ ఆధ్వర్యంలో యువకులు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి గెలుపు కోసం గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తామని చెప్పడంతో వారిని సోలిపేట రామలింగారెడ్డి అభినందించారు. కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్‌గౌడ్, మండల రైతు సమన్వయ సమతి అధ్యక్షుడు యాదగిరి గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...