ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి


Mon,November 19, 2018 12:11 AM

మద్దూరు: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌ఐ పాడి రాజిరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గాగిళ్లాపూర్, లింగాపూర్, దూల్మిట్ట, జాలపల్లి, అర్జున్‌పట్ల, కమలాయపల్లి గ్రామాల్లో ఎన్నికల నియమావళిపై ప్రజలకు ఎస్‌ఐ రాజిరెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెతిపారు. గ్రామాల్లో వివిధ రాజకీయ పార్టీలు నిర్వహించే ప్రచార సభలను అడ్డుకుంటే కేసులను నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అలజడులకు తావివ్వకుండా అన్ని రకాల ఏర్పాట్లును చేస్తున్నట్లు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రజలు సహకరించాలన్నారు. ప్రధానంగా రాజ్యంగం ప్రసాదించిన ఓటు హక్కును ఓ బాద్యతగా వినియోగించుకోవాలన్నారు. అంతకుముందు ఆయా గ్రామాల పరిధిలో పోలీసులు వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు.కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బాదె రాజు, కానిస్టేబుళ్లు తదితరులు ఉన్నారు.

129
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...