మల్లన్న క్షేత్రంలో భక్తుల మొక్కులు


Mon,November 19, 2018 12:10 AM

చేర్యాల, నమస్తే తెలంగాణ : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలిరావడంతో మల్లన్న క్షేత్రంలో సందడి నెలకొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం వేకువజామున నిద్ర లేచి కోనేరులో పవిత్ర స్నానం ఆచరించి స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనం అనంతరం గంగరేగు చెట్టు వద్ద ముడుపులు, పట్నం, మరికొందరు తాము బస చేసిన గదుల వద్ద, మహామండపంలో పట్నాలు వేయించి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకోవడంతో పాటు కోరిన కోరికలు తీర్చాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ కమిషనర్ టి.వెంకటేశ్, ఏఈవో రావుల సుదర్శన్, సూపరింటెండెంట్ నీల శేఖర్, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందించారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...