టీఆర్‌ఎస్ గెలుపును ఏ కూటములూ అడ్డుకోలేవు


Sat,November 17, 2018 10:53 PM

రాయపోల్ :తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మళ్లీ చరిత్ర తిరగరాయబోతున్నారని దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత స్పష్టం చేశారు. రాయపోల్ మండలంలోని రామారం, సయ్యద్‌నగర్, గోల్లపల్లి, ఉదయ్‌పూర్, కొత్తపల్లి, కిష్టాసాగర్ గ్రామాల్లో ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ గెలుపును ఏ కూటములూ అడ్డుకోలేవని, మాయమాటలతో మోసం చూసే పార్టీలకు ప్రజలే బుద్ధ్ది చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షురాలు అబ్బగౌని మంగమ్మ, వీరమణి భూపాల్‌రెడ్డి, పీఎసీఎస్ వైస్ చైర్మన్ ఆస జ్యోతి, చైర్మన్ రణం జ్యోతి, చైర్మన్ పడకంటి శ్రీనివాస్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు రణం శ్రీనివాస్‌గౌడ్, మండల పార్టీ కన్వీనర్ వెంకటేశ్వర శర్మ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు యాదగిరి, పాల్గొన్నారు.
సోలిపేట సతీమణి ప్రచారానికి బ్రహ్మరథం
రాయపోల్ మండలంలోని పల్లె పల్లెనా టీఆర్‌ఎస్ ప్రచారం ఉపందుకుంది. శనివారం దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత ఇంటింటికీ ప్రచారం చేపట్టారు. భాగంగానే రామారం, సయ్యద్‌నగర్ ప్రచారం చేశారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కారుగుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఉదయ్‌పూర్ గ్రామంలో నిర్వహించిన ప్రచారానికి గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు.గ్రామ టీఆర్‌ఎస్ నాయకులు లక్ష్మణ్ అధ్వర్యంలో మహిళలు బోనాలు, బతుకమ్మలతో డప్పు వాయిద్యాలతో సోలిపేట సుజాతకు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులు టీఆర్‌ఎస్ ప్రచారానికి అపూర్వ స్వాగతం పలికారు.
టీఆర్‌ఎస్‌కే సంపూర్ణ మద్దతు
రాయపోల్ మండలం ఉదయ్‌పూర్ గ్రామస్తులు టీఆర్‌ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డికి సంపూర్ణ మద్దతు తెలిపారు. గ్రామానికి వచ్చిన సోలిపేట సతీమణి సుజాత సమక్షంలో గ్రామస్తులు ఏకమత్తంగా ఉండి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.గ్రామస్తులు ఐక్యంగా ఉండి తమ గ్రామ ఓట్లు మొత్తం టీఆర్‌ఎస్‌కు వేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు లక్ష్మణ్, సత్యం,తదితరులుగ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.

134
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...