టీఆర్‌ఎస్ పాలనలో చేర్యాల అభివృద్ధి


Sat,November 17, 2018 10:52 PM

- నాలుగున్నరేండ్లుగా కనిపించని పొన్నాల లక్ష్మయ్య
-జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
-టీఆర్‌ఎస్‌లో చేరికలు
ల, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ హయాంలోనే చేర్యాల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, టీఆర్‌ఎస్ పార్టీని అన్నివర్గాల ప్రజలు ఆదరించి, కాపాడుకోవాలని జనగామ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కోరారు. చేర్యాల శివారు గ్రామాలు గడితోట, యాదవనగర్ గ్రామాల్లో శనివారం రాత్రి ముత్తిరెడ్డి టీఆర్‌ఎస్ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సుంకరి మల్లే శం, రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్‌నర్సయ్య, మండల అధ్యక్షుడు అంకుగారి శ్రీధర్‌రెడ్డిలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముత్తిరెడ్డి మాట్లాడుతూ చేర్యాల పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో మంత్రి హరీశ్‌రావు సహకారంతో చేర్యాలను మరింత అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. మహాకూటమి ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని వారి పట్ల అన్ని వర్గాలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

సూటుకేసులు తీసుకొని ఆంధ్రోళ్లకు నీళ్లు పంపించిన చరిత్ర పొన్నాల లక్ష్మయ్యదేనని, నాలుగున్నరేండ్లుగా నియోజకవర్గంలో కనిపించని పొన్నా ల ఇప్పు డు ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నట్లు విమర్శించారు. అన్నివర్గాలకు న్యాయం చేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు ఆదరించాలని, మరోసారి కేసీఆర్‌ను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పెద్దమ్మగడ్డ ప్రాంతంలోని వడ్డెర కులస్తులు, ప్రతిపక్ష పార్టీల నుంచి భారీగా టీఆర్‌ఎస్‌లో చేరారు. యాదవనగర్‌లో జరిగిన కార్యక్రమంలో ముత్తిరెడ్డి డ్యాన్స్ చేశారు. కార్యక్రమాల్లో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బందెల మహిపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ముస్త్యాల అరుణ, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ తాడెం రంజితాకృష్ణమూర్తి, అధికార ప్రతినిధి పుర్మ ఆగంరెడ్డి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ము స్త్యాల నాగేశ్వర్‌రావు, కార్యదర్శి గోనే హరి, మండల ప్రధాన కార్యదర్శి నర్ర ఐలయ్య, యూత్ మండల అధ్యక్షుడు శివగారి అంజయ్య, టీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు మంగోలు చంటి, టౌన్ అధ్యక్షుడు బుట్టి శ్రీనివాస్, ఓగ్గు శ్రీశైలం, నాజర్, జహీరోద్దీన్, ఆడెపు నరేందర్, కందుకూరి సిద్దిలింగం, పచ్చిమడ్ల సతీశ్, పాక బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...