గజ్వేల్‌లో జానారెడ్డి ప్రచారం చేయాలి


Sat,November 17, 2018 10:51 PM

తొగుట: రాష్ట్రం ఏర్పడితే 24 గంటల కరెంట్ సాధ్యం కాదని, దానిని అమలు చేస్తే కేసీఆర్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తామన్న మాజీ మంత్రి జానారెడ్డి మాటనిలుపుకొని గజ్వేల్‌లో కేసీఆర్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయాలని దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి డిమాం డ్ చేశారు. తొగుట మండలం బండారుపల్లి, పెద్దమాసాన్‌పల్లి, ఎల్లారెడ్డిపేట సయ్యద్‌నగర్, తుక్కాపూర్, లింగాపేట, కాన్గల్ గ్రామాల్లో శనివారం సోలిపేట రామలింగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామగ్రామాన ప్రజలు మంగళహారతులు, బోనాలు, మేళాతాళాలు, గంగపుత్రుల వలలతో ఘనంగా స్వాగతం పలికారు. పెద్దమాసాన్‌పల్లి ఎల్లమ్మ దేవాలయంలో, ఎల్లారెడ్డిపేట దర్గా వద్ద మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24గంటల కరెంట్ కూడా తమ చొరవే అని బీజేపీ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అని, 12 సీట్లతో ఏం వెలగబెడుతాడని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి తెలంగాణ వాళ్లలో కుమ్మక్కై మహా కూటమి అవతారం ఎత్తాడని, మన వాళ్లతో మన కంటిని పొడిచే కుట్రలకు బాబు పాల్పడుతున్నాడని ఆయన తీవ్రంగా ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీపీ గంటా రేణుక, మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి, సొసైటీ చైర్మన్ మల్లేశం, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ స్వామి పాల్గొన్నారు.

157
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...