అభివృద్ధిని ఆశీర్వదించండి


Sat,November 17, 2018 10:51 PM

-సీఎం కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి
-హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి
- తూప్రాన్ మండలంలో ఇంటింటికీ ప్రచారం
తూప్రాన్ రూరల్: రాష్ట్రంలోని పేదల సం క్షేమం కోసం పాటుపడుతూ ప్రభుత్వ పథకాల్లో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్న సీఎం కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి పిలుపునిచ్చారు. తూప్రాన్ పట్టణంతోపాటు మండలంలోని కిష్టాపూర్, వట్టూర్, వెంకటరత్నాపూర్, జండాపల్లి గ్రామాల్లో తూప్రాన్ జడ్పీటీసీ సుమనభాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, మాజీ సర్పంచ్‌లు కమ్మరి సత్యనారాయణ, శివమ్మ, వీర్‌కుమార్‌గౌడ్, ఆత్మకమిటీ వైస్ చైర్మన్ బాబుల్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీశైలంగౌడ్, మత్య్సశాఖ జిల్లా డైరెక్టర్ గడప దేవేందర్‌తో కలిసి శనివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇం టింటికీ తిరుగుతూ కారుగుర్తుకు ఓటేసి సీఎం కేసీఆర్‌కు భారీ మెజార్టీని తీసుకురావాలని ఆయన ఓటర్లను కోరారు.

ఈ నాలుగేండ్ల టీఆర్‌ఎస్ పాలనలో జరిగిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రభు త్వపరంగా నిరుపేదలకు అందుతున్న సంక్షేమ పథకాలపై ముమ్మరంగా ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం పరంగా ఆ కుటుంబానికి అందిన పథకాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. నాలుగేండ్ల కాలంలోనే తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ ప్రాంతంలోని నిరుపేదల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆయా కార్యక్రమాల్లో తూప్రాన్ జడ్పీటీసీ సుమనభాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్, ఎంపీటీసీ సరిత, టీఆర్‌ఎస్ గ్రామకమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...