వంటేరు..గో బ్యాక్


Thu,November 15, 2018 11:39 PM

-సీఎం కేసీఆర్ వల్లే గజ్వేల్ అద్భుతంగా అభివృద్ధి చెందింది..
-సీఎంను విమర్శిస్తే ఊరుకోం..
-కాంగ్రెస్ నాయకులు మా ఊరికి రావొద్దు..
-నువ్వు కూడా అభివృద్ధిని కోరుకుంటే పోటీలోనుంచి తప్పుకో..
-వంటేరు ప్రతాపరెడ్డి పై ఎదురు తిరిగిన మల్కాపూర్‌వాసులు
తూప్రాన్ రూరల్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్‌రెడ్డికి గ్రామస్తుల నుంచి నిరసన సెగ ఎదురైంది. కాంగ్రెస్ ప్రచార రథం దిగకుండానే ప్రతాప్‌రెడ్డి మల్కాపూర్ నుంచి మెల్లగా జారుకున్నారు. టీఆర్‌ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరుగలేద ని, సీఎం కేసీఆర్ స్వప్రయోజనాల కోసం తాపత్రయపడుతున్నారని ఆరోపించడమే కాకుండా ఆయన కుటుంబంపై వ్యక్తి దూషణలు చేస్తుండటంతో ప్రతాప్‌రెడ్డిపై గ్రామస్తుల్లో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో గ్రామస్తులు ప్ర తాప్‌రెడ్డికి ఎదురు తిరిగారు. నీ పార్టీ గురించి ప్రచారం చేసుకోవాలే గానీ, సీఎం కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదంటూ గ్రామస్తులు మండిపడ్డారు. కేసీఆర్ మల్కాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృ ద్ధి చేశారని, గ్రామంలో రోడ్లు, మురికికాల్వలు, గ్యాస్ సిలిండర్‌లు, సబ్సీడీపై ప్రభుత్వ పథకాలను గ్రామస్తులకు అందజేశారు. నిరుపేదలు, వ్యవసాయ రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్నారన్నారు. ఇంత కంటే మాకేం కావాలి.. గెలిస్తే ఇంత కంటే గొప్ప అభివృద్ధి ఇంకేం చేస్తావు.. అంటూ ప్రతాప్‌రెడ్డిని నిలదీశారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందాలనే ఆశతో వచ్చావని, ఎమ్మెల్యే పదవీ మీదున్న కాంక్ష ప్రజలకు చేయాలనే ఆలోచన ఉందా? అని ప్రశ్నించారు.

ఓట్లు వేయాలంటూ ప్రచారం కోసం వచ్చావని, పని చూసుకొని వెళ్లని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటే జై కేసీఆర్.. జైజై తెలంగాణ అంటూ గ్రామస్తులు మూకుమ్మడిగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి ప్రతాప్‌రెడ్డికి గ్రామస్తులు వివరిస్తుండగానే కాంగ్రెస్ ప్రచార రథం నుంచి దిగకుండానే అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. అనంతరం గ్రామస్తులు విలేకరులతో మాట్లాడారు. మల్కాపూర్ స్వచ్ఛతకు మారుపేరని, గ్రామస్తులంతా ఏకతాటిపై ఉన్నామని, అభివృద్ధి పనులను చేస్తున్న సీఎం కేసీఆర్‌కే ఓట్లేసి గెలిపించుకుంటామంటూ గతంలోనే తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా, సీఎంగా కేసీఆరే ఉండాలనే కోరుకుంటున్నామంటూ గ్రామస్తులంతా ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. గ్రామస్తులమంతా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటున్న తరుణంలో డబ్బు, మద్యంతో ప్రలోభాలకు గురి చేస్తూ, ప్రతాప్‌రెడ్డి గ్రామస్తుల్లో విభేదాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి చేసే లక్షణమే ఉన్నట్లయితే సంక్షేమాభివృద్ధి కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌పై ఎన్నికల్లో పోటీ చేయబోరని వారు స్పష్టం చేశారు. నిజమైన రాజకీయ పరిజ్ఞానం, గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిని కోరుకుంటున్న వ్యక్తే అయితే తక్షణమే నామినేషన్ వేయకుండా రాజకీయాల నుంచి ప్రతాప్‌రెడ్డి తప్పుకోవాలని మల్కాపూర్ గ్రామస్తులు సూచించారు.

182
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...