కేసీఆర్ సర్కార్‌ను ఆశీర్వదించండి


Thu,November 15, 2018 11:39 PM

దుబ్బాక, నమస్తే తెలంగాణ: దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి.. సంక్షేమం తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగింది. గత ఎన్నికల్లో ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని, ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మాజీ ఎమ్మెల్యే, దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి కోరారు. గురువారం దుబ్బాక మండలం పోతారెడ్డిపేట, తాళ్లపల్లి, నగరం, ఎనగుర్తి, బొప్పాపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సోలిపేటకు మహిళలు మంగళహారతులు, బోనాలతో స్వాగతం పలికారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల మ్యానిఫెస్టో పత్రాలను ప్రజలకు అందజేస్తూ..టీఆర్‌ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా రామలింగారెడ్డి మాట్లాడుతూ 60 ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీలు చేయలేని అభివృద్ధి.. కేవ లం నాలుగేండ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. దేశంలో బీజేపీ అధికారం లో ఉన్న రాష్ర్టాల్లో ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలు తెలంగాణలో ప్రవేశ పెట్టిన ఘనత కేసీఆర్ సర్కార్‌దేనన్నారు. మల్లన్నసాగర్‌తో దుబ్బాక నియోజకవర్గం సస్యశ్యామలంగా మారనుందన్నారు. మల్లన్నసాగర్ ద్వారా నియోజకవర్గంలో 1.40 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. ఇండ్లు లేని నిరుపేదలందరకీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు అందజేస్తామన్నారు. ఇతర పార్టీల నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దన్నారు. తాగునీటి కష్టాలు శాశ్వతంగా దూరం చేసేందుకే టీఆర్‌ఎస్ ప్రభు త్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందించిందన్నారు. ఈ ఎన్నికల్లో మరోసారి తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఓటర్లను సోలిపేట కోరారు.
తాళ్లపల్లి, నగరం, ఎనగుర్తి గ్రామాల్లో

టీఆర్‌ఎస్‌లో చేరికలు..
ఎన్నికల ప్రచారంలో భాగంగా తాళ్లపల్లి, నగరం, ఎనగుర్తి గ్రామాల్లో పలు యువజన సంఘాల నాయకులు, మహిళా సంఘాల సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకా లకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రొట్టే రాజామౌళి, ఎం పీపీ ర్యాకం పద్మాశ్రీరాములు, నాయకులు తౌడ శ్రీనివాస్, ఎల్లారెడ్డి, మల్లారెడ్డి, జీడిపల్లి రవి, శ్రీనివాస్‌గౌడ్, జ్యోతికృష్ణ, లింబాద్రిగౌడ్, వెంకటపతి, కొంగరి రాజయ్య, మల్లే శం,స్వామిగౌడ్, నారాగౌడ్, బానాల శ్రీనివాస్, సంజీవ్‌రెడ్డి, కైలాష్, పి.రాజయ్య, కిషన్, దయాకర్‌రెడ్డి, పద్మయ్య, రమేశ్, వై.ప్రసాద్, బడుగురాజు, దాత్రిక భాగ్యలక్ష్మి, అనురాధ, శిరీష, కొట్టే ఇందిర పాల్గొన్నారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...