సాదాసీదాగా..


Wed,November 14, 2018 11:32 PM

-గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ నామినేషన్
గజ్వేల్, నమస్తే తెలంగాణ: గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండోసారి ప్రాతినిధ్యం వ హించడానికి సీఎం కేసీఆర్ బుధవారం నామినేషన్ పత్రాలను ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి విజయేందర్‌రెడ్డికి సమర్పించారు. కోనాయిపల్లి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వా త ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి, అక్కడి నుంచి నేరుగా ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారు. మధ్యాహ్నం 2:26నిమిషాలకు కాన్వాయ్ ఆర్డీఓ కార్యాలయాన్ని చేరుకుంది. సీఎం కేసీఆర్ తన మొదటి నామినేషన్ పత్రాన్ని 2:33నిమిషాలకు, రెండో నామినేషన్‌ను 2:39నిమిషాలకు సమర్పించారు. కేసీఆర్‌ను టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, జడ్పీ మాజీ చైర్మన్ మణికొండ లక్ష్మీకాంతారావు, నాచారం ట్రస్టు బోర్డు చైర్మన్ కొట్టాల యాదగిరి బలపర్చారు. వీరు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, స్థానిక ఆర్డీఓ విజయేందర్‌రెడ్డికి అందించారు. అక్కడి నుంచి 2:59నిమిషాలకు కేసీఆర్ గజ్వేల్ నుంచి బయలుదేరారు.

సాదాసీదాగా నామినేషన్
సీఎం సీఆర్ నామినేషన్ అట్టహాసంగా ఉంటుందని పలువురు భావించినా, ముందుగా సూచించినట్లుగానే ఎవరూ నామినేషన్ రోజు గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయానికి రావద్దని చెప్పడంతో బలపర్చే మరో ఇద్దరితో కలిసి వచ్చి రెండు జతల నామినేషన్ పత్రాలను సమర్పించారు. కేసీఆర్ ముందుగా చెప్పినట్లే సాదాసీదాగా గజ్వేల్‌లో నామినేషన్ సమర్పించారు. రెండు జతల నామినేషన్‌పత్రాలను సమర్పించడానికి గజ్వేల్ ఆర్డీవో కార్యాలయానికి వచ్చినప్పుడు రోడ్డుకు ఇరువైపు లా పెద్ద సంఖ్యలో వివిధ గ్రామాల ప్రజలు, టీఆర్‌ఎస్ వర్గాలు బారులు తీరారు. నామినేషన్ ప ర్వాన్ని సాదాసీదాగా నిర్వహించాలని కేసీఆర్ సూ చనల మేరకు గజ్వేల్‌లో ఎలాంటి ఆడంబరాలకు తావులేకుండా నామినేషన్ కార్యక్రమం జరిగింది.

గజ్వేల్‌లో సంబురాలు
సీఎం కేసీఆర్ నామినేషన్ వేసిన సందర్భంగా పలువురు గజ్వేల్‌లో సంబురాలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచుకొని, పలు గ్రామాల్లో పటాకలు కాల్చారు. కేసీఆర్ గజ్వేల్ నుంచి మరోసారి భారీ విజయంతో గెలుపొందుతున్నారని, సీఎం పదవి బాధ్యతలు చేపడుతారని కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ్ మండలం గోతూరు గ్రామానికి చెందిన కేసీఆర్ వీరాభిమాని బోడి జైపాల్ బుధవారం గజ్వేల్ ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని కేసీఆర్ నామినేషన్ సమర్పించిన వెంటనే 101కొబ్బరికాయలు కొట్టి భారీ మెజార్టీతో గెలుపొందాలని తిరిగి సీఎంగా బాధ్యతలు చేపట్టాలని మొక్కుకున్నాడు.

155
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...