ఆరోసారి ఆశీర్వదించండి


Wed,November 14, 2018 11:32 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ ఆశీస్సులు.. మీ దీవెనలతో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. మీ అందరి ఆశీర్వాదంతో ఆరోసారి నామినేషన్ వేశా.. ఈ సారి మంచి మెజార్టీని ఇచ్చి నన్ను దీవించండి.. మీకు మరింత సేవ చేసే అవకాశం ఇవ్వండి.. అని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రజలను కోరారు. బుధవారం సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, నాయకులు వంగ నాగిరెడ్డి, బాలకిషన్‌రావు, తుపాకుల బాల్‌రంగంతో కలిసి సిద్దిపేట స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా హరీశ్‌రావు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్ దీవెనలతో కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేసి సిద్దిపేట దర్గా, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశానని, భగవంతుని ఆశీస్సులతో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇంటి ముందు అభివృద్ధి.. కంటి ముందు అభ్యర్థిని చూసి ఓటు వేయాలన్నారు.

నాలుగున్నరేండ్లలో సిద్దిపేట నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో, పండుగల్లో ఇంటి సభ్యుడిగా అందరికి అందుబాటులో ఉండి సేవ చేశానన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సిద్దిపేట ప్రజల కళ అయిన జిల్లాను ఏర్పాటు చేసుకున్నామన్నారు. త్వరలోనే సిద్దిపేటకు రైలు రానుందని, సిద్దిపేట రైతాంగానికి సాగుకోసం గోదావరి నీళ్లు తీసుకరావాలనే కళను త్వరలో సాకారం చేసుకోబోతున్నామన్నారు. దేశంలోనే సిద్దిపేటను ఆదర్శంగా నిలుపుతామన్నారు. ఇప్పటికే సిద్దిపేట పేరు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే అవార్డులు లేవన్నారు. సిద్దిపేట ప్రజలు గర్వపడేలా పనిచేశానని, మీ అందరి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని, మంచి మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలన్నారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్ పటేల్, పట్టణాధ్యక్షుడు నయ్యర్ పటేల్, సీనియర్ నాయకులు మోహన్‌లాల్, పూజల వెంకటేశ్వర్‌రావు, కౌన్సిలర్లు బర్ల మల్లికార్జున్, వేణుగోపాల్‌రెడ్డి, మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

129
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...