ముహుర్తం @2:34


Tue,November 13, 2018 11:35 PM

-నేడు కోనాయిపల్లి వెంకన్న సన్నిధికి సీఎం కేసీఆర్
-ఉదయం 10 గంటలకు ప్రత్యేక పూజలు
-దైవ సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సంతకాలు
-మంత్రి హరీశ్‌రావు సైతం
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ/నంగునూరు : సీఎం కేసీఆర్ నేడు గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. ముందు గా ఇష్టదైవమైన నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో స్వయంగా నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి కోనాయిపల్లికి చేరుకుంటారు. స్వా మి వారి సన్నిధిలో నామినేషన్ పత్రాలు పెట్టి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నామినేషన్ పత్రాలపై సంతకాలు చేస్తారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీశ్‌రావు నామినేషన్ పత్రాలకు పూజలు చేసి సంతకాలు చేస్తారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. అక్కడి నుంచి నేరుగా గజ్వేల్ ఆర్డీవో కా ర్యాలయానికి వెళ్లి 2 గంటల 34 నిమిషాలకు సీఎం కేసీఆర్ స్వయం గా నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు 2 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటలలోపు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నారు. కాగా, 1985 నుంచి కోనాయిపల్లి వేంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ ప త్రాలపై సంతకాలు పెట్టి వేస్తున్న సంప్రదాయాన్ని సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారు. 2004 నుంచి మంత్రి హరీశ్‌రావు సైతం అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు...
నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వర ఆలయానికి సీఎం కేసీఆర్ బుధవారం వస్తుండడంతో స్థానికంగా ఏర్పాట్లను మంత్రి తన్నీరు హరీశ్‌రావు పరిశీలించారు. అనంతరం స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ వస్తుండడంతో పోలీస్ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. వేంకటేశ్వర ఆలయాన్ని ముస్తాబు చేశారు. మామిడి తోరణాలు, పూలమాలలతో అలంకరించారు. మంత్రి వెంట ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, జిల్లా ప్రణాళిక సంఘం సభ్యులు దువ్వల మల్లయ్య, ఏఎంసీ చైర్మన్లు వేముల వెంకట్‌రెడ్డి, ఎడ్ల సోంరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అనగోని లింగంగౌడ్, సీనియర్ నాయకులు తడిసిన వెంకట్‌రెడ్డి, సంగు పురేందర్, కోమాండ్ల రామచంద్రారెడ్డి, నాయకులు నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి, పిల్లి వెంకటేశం, ఉమ్మారెడ్డి, నిమ్మ మల్లారెడ్డి, జైపాల్‌రెడ్డి, బాలకిషన్, భిక్షపతినాయక్, తిరుపతి పాల్గొన్నారు.
నేడు నామినేషన్ వేయనున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు...
జిల్లాలోని హుస్నాబాద్, దుబ్బాక, జనగామ నియోజకవర్గాల టీఆర్‌ఎస్ అభ్యర్థులు వొడితెల సతీశ్‌కుమార్, సోలిపేట రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నామినేషన్లు వేయనున్నారు.

211
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...