ఓర్వలేకనే టీఆర్‌ఎస్‌పై విమర్శలు


Tue,November 13, 2018 11:34 PM

దుబ్బాక టౌన్ :అమాసకు..పున్నానికి నియోజకవర్గానికి వచ్చి పోయే బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావును ప్రజలు అసలు ఎలా టీఆర్‌ఎస్వీ నాయకులు సూటిగా ప్రశ్నించారు. దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు ఉన్న ఆదరణ, ఎన్నికల ప్రచారంలో ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలను జీర్ణించుకోలేకనే రఘునందన్‌రావు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వారన్నారు. మంగళవారం దుబ్బాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరి శేఖర్‌గౌడ్, నియోజకవర్గ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్ మాట్లాడుతూ ఆరాటం, పోరాటం అంతా డిపాజిట్ దక్కించుకునేందుకే అన్నారు. పార్టీలు మారుతూ సిద్ధాంతం అంటూ లేక టీఆర్‌ఎస్‌పై అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇంటింటి కీప్రచారంలో భాగంగా పెద్ద చీకోడ్‌లో టీఆర్‌ఎస్‌కు గ్రామస్తులంతా చూపిస్తున్న ఆదరణను తట్టుకోలేకే విమర్శలకు దిగడం సిగ్గుచేటన్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని, అసలు రఘునందన్‌రావు ఎవ్వరని, మేము ఆయనను ఎప్పుడు చూడలేదని జనం తమతో అంటున్నారని టీఆర్‌ఎస్వీ నాయకులు అన్నారు.రామలింగారెడ్డి ఓడినా, గెలిచినా ప్రజల మధ్య ఉండే నాయకుడని ఆయనను విమర్శించే స్థాయి రఘునందన్‌రావుకు లేదన్నారు. నియోజకవర్గంలో బీజేపీకి రెండో స్థానం కాదుకదా డిపాజిట్ దక్కే అవకాశం కూడా లేదని విషయాన్ని గ్రహించాలని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తొగుట మండల అధ్యక్షుడు పరమేశ్వర్‌రెడ్డి, దుబ్బాక మున్సిపాలిటీ అధ్యక్షుడు ఆస రాజశేఖర్,టీఆర్‌ఎస్వీ నాయకులు అరవింద్, పరుశరాములు, రాంప్రసాద్‌గౌడ్, జగన్, దిలీప్‌రెడ్డి, స్వామి, సాగర్, హైమద్ తదితరులు పాల్గొన్నారు.

136
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...