ఓటమి భయంతోనే తప్పుకున్న పొన్నాల


Tue,November 13, 2018 11:33 PM

- టీఆర్‌ఎస్‌కు తిరుగులేదు
- మాజీ సర్పంచ్‌లు కిష్టయ్య, మల్లేశం
కొమురవెల్లి: దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన టీఆర్‌ఎస్ పార్టీకి తిరుగులేదని కొమురవెల్లి మాజీ సర్పంచ్‌లు గొల్లపల్లి కిష్టయ్య, పడిగన్నగారి మల్లేశం అన్నారు. మంగళవారం కొమురవెల్లి మండల కేంద్రంలో వారు మాట్లాడారు. గత పాలకుల చేతిలో దోచుకోబడ్డ తెలంగాణను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కనీవిని ఎరుగని రీతిలో సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు. ఒక టీఎంసీగా ఉన్న రిజర్వాయర్‌ను 0.3 టీఎంసీగా మార్చిన ఘనత మాజీమంత్రి పొన్నాలకే దక్కిందన్నారు. మంత్రిగా ఉండి కనీసం నీళ్ల గేటు ఇప్పని పొన్నాలను గత ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించారన్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన పొన్నాల నాలుగున్నరేండ్లు ముఖం చాటేశారని ఎన్నికలు సమీపించాయని మళ్లీ నియోజకవర్గంలో అడుగుపెట్టిన పొన్నాలను అడుగడుగునా ప్రజలు నిలదీయడంతో పాటు టీఆర్‌ఎస్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓటమి భయంతోనే పొన్నాల పోటీ నుంచి తప్పుకుండన్నారు. టీఆర్‌ఎస్ హయాంలోనే జనగామ ప్రాంతం అభివృద్ధి చెందిందని కరువుతో అల్లాడిన ఈ ప్రాంతానికి కేసీఆర్ ఆశీర్వాదంతో గోదావరి జలాలు తెచ్చి కరువును తరిమేసిన ముత్తిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సార్ల కిష్టయ్య, టీఆర్‌ఎస్ యూత్ మండల ప్రధానకార్యదర్శి పుట్ట కనకరాజు, టీఆర్‌ఎస్ మండల ప్రచారకార్యదర్శి ఏదుల గణేశ్, నాయకులు సార్ల సురేశ్, గొల్లపల్లి మలేశం తదితరులు పాల్గొన్నారు.

144
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...