బైబై గణేశా..


Sun,September 23, 2018 11:14 PM

సిద్దిపేట టౌన్ : వెళ్లి రా గణపయ్య.. మళ్లీ రా గణపయ్య.. అంటూ గణనాథులకు వీడ్కోలు పలికారు. గణనాథుల ఊరేగింపు శోభాయమానంగా జరిగింది. గణనాథులకు మహిళలు మం గళహారతులు పట్టి స్వాగతం పలికారు. తీన్మార్ నృత్యాలు, డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాలతో వినాయకులను పట్టణంలోని పురవీధుల మీదుగా ఊరేగించారు. ప్రధాన కూడళ్లు.. నిమజ్జన చెరువుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట, గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్, దుబ్బాక తదితర పట్టణాలతోపాటు ఆయా గ్రామాల్లో నెలకొల్పిన గణనాథులను చెరువుల్లో నిమజ్జనం చేశారు.
ప్రధానంగా జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో గణేశ్ నిమజ్జనోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. సిద్దిపేట లాల్‌కమాన్ ఏరియాలో నెలకొల్పిన పార్వతీ ఫ్యామిలీ అసోసియేషన్, నర్సపురం చౌరస్తా వద్ద గల భజరంగ్ యూత్, బొర్ర పెరుమాండ్ల యూత్ అసోసియేషన్, గణేశ్‌నగర్‌లోని రెడ్డి సంక్షేమ సంఘం వివిధ అసోసియేషన్లు నెలకొల్పిన గణనాథులతోపాటు వందలాది వినాయకులను కోమటి చెరువులో నిమజ్జనం చేశారు. నిమజ్జనానికి తిలకించేందుకు వేలాది మంది ప్రజలు ప్రధాన కూడళ్లలో... కోమటి చెరువు వద్దకు వెళ్లి నిమజ్జనోత్సవాన్ని వీక్షించారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...