ఈవీఎంలకు జియో ట్యాగింగ్


Sun,September 23, 2018 01:56 AM

- అసెంబ్లీ ఎన్నికలకు అధికారుల ఏర్పాట్లు
- కలెక్టరేట్ నుంచే నిరంతర పర్యవేక్షణ
- జిల్లాలో 1102 పోలింగ్ కేంద్రాలు
- ఇప్పటికే జిల్లాకు చేరిన ఈవీఎంలు
- కొండపాక మార్కెట్ గోదాములో భద్రం
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులు మరో వైపు ఎన్నికల నిర్వహణపై కూడా దృష్టి కేంద్రీకరించారు. ఈ సారి ఎన్నికల్లో జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించడంతో ఆ దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అధికారుల స్మార్ట్ ఫోన్‌ల సహాయంతో పోలింగ్ కేంద్రం, ఈవీఎంలను ఫొటోలు తీసి జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. జిల్లాలో మొత్తం 1102 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా పరిధిలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల నుంచి కలెక్టరేట్‌కు అనుసంధానం అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా పెట్టడంతో పోలింగ్ సరళిని పర్యవేక్షించవచ్చు. ఈవీఎంలలో ఏదైనా సాం కేతిక సమస్యలు ఏర్పడినా అధికారులకు వెంటనే సమాచారం అంది, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయ డం సులభతరమవుతుంది.

శాసన సభ ఎన్నికలకు త్వరత్వరగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో జియోట్యాగింగ్ విధానాన్ని అమ లు చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించడంతో ఆ దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అధికారుల స్మార్ట్‌ఫోన్ల సహాయంతో జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. జిల్లాలో 1102 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సిద్దిపేట, గజ్వేల్, దు బ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాలు జిల్లా పరిధిలోకి వస్తాయి. ఆయా పోలింగ్ కేంద్రాల నుంచి కలెక్టరేట్‌కు అనుసంధానం అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జియో ట్యాగింగ్ అమలుతో ఎన్నికల నిర్వహణ సులభతరంగా ఉండనుంది. ఈ నేపథ్యం లో నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం..

జిల్లాలో హరితహారం కింద నాటిన మొక్కలు, మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువులను జియో ట్యాగింగ్ చేయడంతో మంచి ఫలితాలు వచ్చా యి. శాసనసభ ఎన్నికల్లో కూడా ఆయా పోలింగ్ కేం ద్రాలను జియో ట్యాగింగ్ చేసేందుకు అధికారులు ఏ ర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 4 నియోజక వర్గాలు ఉ న్నాయి. వీటిలో 1102పోలింగ్ బూతులు ఉన్నాయి. జనగామ నియోజక వర్గంంలోని 3 మండలాలు, మానకొండూరు నియోజక వర్గంలోని 1 మండలం, ఆయా నియోజకవర్గ కేంద్రాల నుంచే ఎన్నికల నిర్వహణను చేపట్టనున్నారు. గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజక వర్గాలకు రిటర్నింగ్ అధికారులుగా ఆయా ఆర్డీవోలను నియమించారు. త్వరలో సిద్దిపేట నియోజక వర్గానికి రిటర్నింగ్ అధికారిని నియమించనున్నారు. ఎన్నికల కమిషన్ జియో ట్యాగింగ్ చేపట్టనుండడంతో ప్రతి పోలింగ్ కేంద్రాన్ని జియోట్యా గింగ్ చేస్తారు. జియో ట్యాగింగ్ చేయడంతో ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. శాటిలైట్ ఆధారం గా భూగోళంపై ఏ వస్తువు ఎక్కడ ఉందో సులభతరం గా తెలిసిపోతుంది. ఎన్నికల విధి నిర్వహణలోని అధికారులు తమ స్మార్ట్‌ఫోన్ లో జియోట్యాగింగ్ ఆప్షన్ వేసుకొని పోలింగ్ కేంద్రం ఫొటో తీయడంతో అక్కడి ప్రాంత ఆక్షాంశాలు, రేకాంశాలు నమోదవుతాయి. మొబైల్‌లో ఈవీఎంల ఫొటోలు తీయడంతో ఈవీఎంలపై ఉన్న బార్‌కోడ్ స్కానింగ్ చేసి తమ వద్ద కం ప్యూటర్‌లో నమోదు చేయడంతో ఆయా ఈవీఎంల వివరాలన్నీ కలెక్టరేట్‌లో ఉన్న కంప్యూటర్‌లో నిక్షిప్తం అవుతాయి. దీని ద్వారా ఎప్పటికప్పుడు కలెక్టర్ పర్యవేక్షిస్తారు. సమస్యాత్మక ప్రాంతాలు, కావాలనే గొడవ చేసి ఈవీఎంలు ఎత్తుకెళ్లడం ఇటువంటి సమస్యలు జియో ట్యాగింగ్ విధానంతో పరిష్కారమవుతాయి. ఈవీఎంలను ఎత్తుకెళ్లినా అవి ఎక్కడున్నాయో గుర్తిం చి, స్వాధీనం చేసుకోవచ్చు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లను గ్రామాలకు చేర్చే క్రమంలో పోలీసులు మరింత నిఘా పెట్టే అవకాశం ఉంటుంది.

* జిల్లాకు చేరిన ఈవీఎంలు
జిల్లాకు ఈవీఎంలు రెండు రోజుల క్రితమే చేరగా, కొండపాకలోని మార్కెట్ గోదాంలో భద్రపరిచారు. 1490 వీవీ ప్యాట్లు, 1760 బ్యాలెట్ యూనిట్లు, 1380 కంట్రోల్ యూ నిట్లు వచ్చాయి. జిల్లాలో 1102 పోలింగ్ బూతులున్నప్పటికీ అంతకన్న ఎక్కువగానే ఈవీఎంలు వచ్చాయి. ఈవీఎంల్లో ఏదైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే మరో ఈవీఎం ఏర్పాటు చేసేందుకు అదనంగా ఈవీఎంలు వచ్చాయి. ఈ సారి ఎన్నికల్లో ఎవరికి ఓటు వేశామో? తెలుసుకునే విధంగా వీవీ ప్యాట్ విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...