ఓటర్ల జాబితా తప్పొప్పులను అధికారుల దృష్టికి తేవాలి


Sun,September 23, 2018 01:55 AM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : ఓటర్ల జాబితాలో గుర్తించిన తప్పొప్పులను వెంటనే అధికారుల దృష్టికి తేవాలని జిల్లా ఎన్నికల అబ్జర్వర్ అనితారాజేంద్ర తెలిపారు. శనివారం సిద్దిపేట కలెక్టరేట్‌లో కలెక్టర్ కృష్ణభాస్కర్ అధ్యక్షతన ఓటర్ల జాబితా సవరణపై అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనితారాజేంద్ర మాట్లాడుతూ.. 2018 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదుకు అర్హులుగా గుర్తించాలన్నారు. ప్రతి యేడాది నిరంతర ఓటర్ల జాబితా సవరణ జరుగుతుందని, మరణాలు, శాశ్వత వలసవెళ్లిన వారి పేర్లను తొలగిస్తే సమాచారం ఇవ్వాలని అఖిల పక్ష ప్రతినిధులను కోరారు. సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, కాంగ్రెస్ నేత ప్రభాకర్‌వర్మ, బీఎస్వీ నేత యాదయ్య, సీపీఎం నేత నాగరాజు, ఎంఐఎం ప్రతినిధులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, సవరణలపై బూత్ లెవల్ ఆఫీసర్లను పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జేసీ పద్మాకర్, డీఆర్ వో చంద్రశేఖర్, ట్రైనీ కలెక్టర్ అవిశ్వాంత్ పండా, ఆర్డీవోలు జయచంద్రారెడ్డి, విజయేందర్‌రెడ్డి, శ్రీనివాస్, అన్ని మండలా ల తహసీల్దార్లు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

ములుగులో ఓటరు నమోదు పరిశీలన..
గజ్వేల్, నమస్తే తెలంగాణ : మండల కేంద్రం ములుగులో ఓటరు నమోదును జిల్లా ఎన్నికల అబ్జర్వర్, రాష్ట్ర బీసీ వేల్ఫేర్ కమిషనర్ అనితారాజేంద్ర పరిశీలించారు. కలెక్టర్ కృష్ణభాస్కర్‌తో కలిసి బూత్‌పరిధిలో ఓటరు నమోదుపై బూత్ లెవల్ అధికారులతో సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులను స్వయంగా కలిసి వివరాలు ఆరా తీశారు. ములుగు ఫారెస్టు గెస్ట్ హౌస్‌లో కలెక్టర్ కృష్ణభాస్కర్, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, ట్రైనీ కలెక్టర్ అవిశాంత్‌పాండా తదితరులు స్వాగతం పలికారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...