గంగా నర్సరీకి జాతీయ స్థాయి అవార్డు


Sun,September 23, 2018 01:55 AM

సంగారెడ్డి అర్బన్, నమస్తేతెలంగాణ : రైతులకు తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం ఇచ్చే వంగడాలపై మక్కువ ఉంటుంది. రైతులకు అందుబాటులో ఉండే రకాలతో పాటు కొత్త రకాలను అందజేయడంతో గం గా నర్సరీకి జాతీ య స్థాయిలో పేరు ఉంది. ఇందులో భాగంగానే ఇండియన్ నర్సరీ అసోసియేష్ ఆధ్వర్యంలో ఉత్త మ నర్సరీ అవార్డులను ప్రతి మూడేళ్లకోసారి అందజేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన గంగానర్సరీ యాజమాన్యానికి జాతీయస్థాయి తొలి అవా ర్డు దక్కింది. నేడు చెన్నైయ్ నగరంలోని కళైవానర్‌అరంగం ఆడిటోరియంలో ఈ అవార్డును గంగా నర్సరీ చైర్మన్ ఐ.సీ. మోహన్ అందుకోనున్నారు. ఈ అవార్డు రావడానికి ము ఖ్య కారణం నర్సరీలో కొత్త వంగడాలను తయారు చేసి వివి ధ రాష్ర్టాలతో పాటు జాతీయ స్థాయిలో రైతులకు అందజేయడంతో దిగుబడి సాధించిన రైతుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని ఎంపిక చేశారు. ముఖ్యంగా నర్సరీలో వంద రకాల పండ్ల మొక్కలను చిన్న, సన్నకార రైతు నుంచి పెద్ద రైతుల వరకు ఏ సమయంలోనైనా అందించే నర్సరీగా పేరుగాంచింది. దేశీయ పండ్ల మొక్కలతో పాటు విదేశాల్లో పండ్ల మొక్కలను అందించడానికి అందుబాటులో ఉంచా రు. ముఖ్యంగా ఆపిల్, చెర్రి, లవంగం, ఇలాచి, వక్కల మొక్కలతో పాటు మామిడి రకాలు, జామ రకాల మొక్కలను రైతులకు అందిస్తుంది.

40 ఎండ్ల గంగానర్సరీ
1978లో సంగారెడ్డి రాజంపేట శివారులో 2ఎకరాల విస్తీర్ణంలో అంటుకట్టు విధానంలో మొక్కలను తయారు చేయడం మొదలు పెట్టారు. క్రమేనా అభివృద్ధి చెంది జాతీ య, అంత్జాతీయ స్థాయిలో గంగా నర్సరీ పేరు వినిపించ డం యాజమాన్యానికి సంతోషం కలిగిస్తుంది. వంద రకాల మామిడి మొక్కలు నర్సరీలో పెంచుతూ రైతులకు అందజేసి పంట దిగుబడిపై నర్సరీ యాజమాన్యం ఎప్పటికప్పు డు పర్యవేక్షించడంతో రైతులకు నమ్మకం పెరిగింది. ప్రత్యేకంగా నేపాల్ దేశంలో అధిక ప్రాంతాల్లో పండే రుద్రాక్ష మొ క్కలను దిగుబడి చేసుకుని ఆసక్తి కలిగిన రైతులకు అందించేందుకు సిద్ధం చేశారు. దీంతో పాటు డ్రాగన్ ఫ్రూట్ విదేశీ రకాన్ని రైతులకు పంపిణీ చేసేందుకు అందుబాటులో ఉంచారు. అలాగే జామలో తైవాన్ రకం తెలుపు, ఎరుపు రంగు రకాల మొక్కలను రైతులకు అందించేందుకు యాజమాన్యం అందుబాటులో ఉంచింది.

శ్రమకు దక్కిన ఫలితం
జాతీయ స్థాయిలో అవార్డుకు గంగా నర్సరీ ఎంపిక కావడం శ్రమ కు దక్కిన ఫలితంగా భావిస్తున్నా. కొత్త, కొత్త రకాల వంగడాలు తయారు చేసి దేశ వ్యాప్తంగా రైతులకు అందజేస్తున్నా. మొక్కల రవాణాకు ఇబ్బందులు లేకుండా యాజమాన్యం రైతుకు చేరవేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి అవార్డు గంగానర్సరీకి రావడం గర్వంగా ఉంది. ఇండియన్ సైన్స్ అసోసియేషన్ అవార్డు ఎంపిక కమిటీలో సైన్టిస్టులు సభ్యులుగా ఉండి రైతులకు మేలు రకాల పండ్ల మొక్కలను అందజేసిన నర్సరీలకు ప్రాధాన్యత కల్పించడం సంతోషకరం. రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు పొందాము. జాతీ య స్థాయిలో అవార్డు రావడం జీవితంలో మర్చిపోలేనిది.
- ఐ.సీ.మోహన్, గంగానర్సరీ చైర్మన్

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...