పథకాల అమలులో మనమే నెంబర్ వన్


Fri,September 21, 2018 11:30 PM

అందోల్, నమస్తే తెలంగాణ: ముస్లిం మైనార్టీల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, పథకాల అమల్లో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా గుర్తింపును పొందిందని, రాష్ట్ర బడ్జెట్‌లో రూ.200 కోట్లను కేటాయించిందని జహిరాబాద్ ఎంపీ బీబీ పాటీల్ అన్నారు. శుక్రవారం జోగిపేటలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మున్సిపాలిటీ ముస్లిం మైనార్టీల చేరిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దివంగత మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసి, నెంబర్ వన్ రాష్ట్రంగా ప్రశంసలు అందుకుందన్నారు. నిరుపేద ముస్లిం కుటుంబాల్లో ఆడపిల్లల వివాహానికి తనవంతు సహకారంగా షాదీముబారక్ పేరిట రూ.1,001,16లను అందిస్తుందన్నారు. రంజాన్ పండుగ సమయంలో కుటుంబానికి కొత్త దుస్తులు అందించామని, మౌజామ్‌లకు వేతనాలను పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ పథకం కింద కొత్త ఇండ్లను అందిస్తున్నామన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించేందుకు పరిశ్రమలను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. బంగారు తెలంగాణ మార్చాలంటే సీఎం కేసీఆర్‌కు మద్దతుగా నిలువాలని, మరోసారి టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు.

ఇందుకోసం టీఆర్‌ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్‌కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, 2014 ఎన్నికల్లో పొందుపరిచిన హామీల కంటే అదనంగా మరిన్ని పథకాలను ప్రవేశపెట్టిందని దేశంలో ఆగ్రస్థానంలో నిలిచిందన్నారు. ముస్లిం మైనార్టీల విద్యాభివృద్ధికి ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసి, నాణ్యమైన విద్యనందిస్తుందని, విదేశాల్లో విద్యనభ్యసించేందుకు ఆర్థిక సహకారాన్ని అందిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని, మరోసారి టీఆర్‌ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం మనందరిపైన ఉందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా సాహసోపేత నిర్ణయాలను సీఎం కేసీఆర్ తీసుకుని, ప్రజల సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. రాబోవు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్‌ను గెలిపించేందుకు కార్యకర్తలందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. సమావేశంలో డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ జైపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ డీబీ నాగభూషణం, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు లింగాగౌడ్, జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, అందోలు, వట్‌పల్లి, రాయికోడ్ మండలాల పార్టీ అధ్యక్షులు లక్ష్మీకాంత్‌రెడ్డి, వీరారెడ్డి, విఠల్, మున్సిపల్ కౌన్సిలర్లు పి.గోపాల్‌రావు, పిట్ల లక్ష్మణ్, గాజుల నవీణ్‌కుమార్, జెడ్పీ విప్ మాజీ నారాయణ, పట్టణ అధ్యక్షుడు చాపల వెంకటేశం, నాయకులు అల్లె గోపాల్, రవీందర్‌గౌడ్, నాగరాజు, నరేశ్, మైనార్టీ నాయకులు ఖాజాపాషా, గోరే, లయాక్ ఆలీ, ఎండీ ఫైజల్, ఆసీఫ్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ గల్లంతు కావడం ఖాయం: టీఆర్‌ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్
అందోల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల నుంచి ఎనలేని లభిస్తుందని, ఆదరణకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గల్లంతు కావడం ఖాయమని అందోలు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి క్రాంతి కిరణ్ అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి గ్రామాల్లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, పార్టీలో చేరేందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. అందోల్ నియోజకవర్గ ప్రజలపై ఉన్న నమ్మకంతోనే కేసీఆర్ స్థానిక నాయకత్వానికి అవకాశాన్ని ఇచ్చారని, కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వచ్చే ఎన్నికల్లో భారీ మేజార్టీతో గెలిపించాలన్నారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్‌పై నమ్మకంతో అందోలు ప్రజలు టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించారని, కేసీఆర్ పాలనలో ప్రవేశపెట్టిన పథకాలతో భారీ మెజార్టీతో మళ్లీ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిపిస్తారన్నారు. సింగూర్ కాలువ నిర్మాణం, జేఎన్‌టీయూ భవనాల నిర్మాణాల పనులను మాజీ డీప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహా బావమరిది అనిల్‌రెడ్డికే కాంట్రాక్ట్ పనులను అప్పగించి, వారి స్వలాభం కోసమే అంతంత మాత్రంగా అభివృద్ధి పనులను చేపట్టి, ఆర్థికంగా ఎదిగారని ఆయన ఆరోపించారు. మా అందోలును మేమే పాలించుకునే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారని, స్థానికేతర నాయకుల్లారా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, మాటనిలబెట్టుకుంటానని, సేవకుడిగా పనిచేస్తానని ఆయన అన్నారు.

జోగిపేటలో భారీ బైకు ర్యాలీ
అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని చేపట్టారు. పట్టణంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ముస్లిం మైనార్టీ యువకులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ, అంబేద్కర్ చౌరస్తా, క్లాక్ టవర్, గౌని, పోచమ్మ దేవాయలం, పబ్బతి హనుమాన్ దేవాలయాల మీదుగా వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ వరకు చేరుకున్నారు. ఈ ర్యాలీలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఫరీదొద్దీన్, అభ్యర్థి క్రాంతి కిరణ్, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ జైపాల్‌రెడ్డిలతో పాటు తదితర ముఖ్యనాయకులు ద్విచక్ర వాహనాలను నడిపి, సందడి చేశారు. కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాల్లి, కారు గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు చేసుకుంటూ, పటాకులను కాల్చుకుంటూ ర్యాలీని కొనసాగించారు.

165
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...