ఘణపురం ఆయకట్టు రైతులకు తీపి కబురు


Fri,September 21, 2018 12:28 AM

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో ఘణపురం ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని పంటలతోపాటు మంజీర నది పరివాహక ప్రాంతం పంటలకు జీవం పోయనున్నది. సింగూరు నుంచి 0.5 టీఎంసీల నీటిని రెండు, మూడు రోజుల్లో విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని తాజా మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నమస్తే తెలంగాణ ప్రతినిధికి తెలిపారు. రెండు, మూడు రోజుల్లో విడుదల చేసే సాగునీరుతో మెదక్ నియోజకవర్గంతోపాటు నర్సాపూర్ నియోజకవర్గంలోని కొల్చారం మండలంలోని పలు గ్రామాల రైతులకు మేలు జరగనున్నది. గురువారం మాజీ డిప్యూ టీ స్పీకర్, టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డితో సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ మేరకు రైతుల సమస్యలు, నీటికొరత విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి స్పందించారు. త్వరలో ఇరిగేషన్ అధికారులకు నీటి విడుదల కోసం ఆదేశాలు రానున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు రైతులు వేసిన పంటలు ఎండకుండా ఘనపూర్ ప్రాజెక్టు పరిధిలోని 21 వేల 600 ఎకరాలతోపాటు నదిపరివాహక ప్రాంతంలోని 20 నుంచి 30వేల పంటలకు లాభం చేకూరనుంది. ఘణపురం ప్రాజెక్టు పరిధిలోని 30 గ్రామాలకు ప్రత్యేక లబ్ధి చేకూరనున్నది. కొల్చారం, మెదక్ మండలం, పాపన్నపేట, హవేళిఘణపూర్ మండలాల పరిధిలోని రైతులకు సాగునీరు అందనున్నది. మం జీర నుంచి విడతల వారీగా పంటలకు 0.5టీఎంసీలు విడుదల చేయనున్నారు.

పంటల పరిరక్షణకు ప్రభుత్వం కృషి
పద్మాదేవేందర్‌రెడ్డి
ఘణపురం ప్రాజెక్టు ఆయకట్టుతోపాటు నది పరివాహక ప్రాంతాల వరి పంటల పరిరక్షణకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి వెల్లడించారు. ఘణపురం ప్రాజెక్టు ఆయకట్టు, నది పరివాహాక ప్రాంతాలకు సింగూర్ నీటిని విడుదల చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ హామి ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాలు లేక మంజీరానది ఎడారిలా మారిందని, దీంతో పాటు ఘణపురం ప్రాజెక్టులో నీరులేక ఆయకట్టుతో పాటు నది పరివాహక ప్రాం తాల్లో వరిపైరు ఎండిపోతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించి రెండుమూడు రోజుల్లో నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించనున్నారని తెలిపారు. నాలుగేండ్లలో ఘణపురం ప్రాజెక్టుతో పాటు మంజీర నది పరివాహక ప్రాంత పంటల సాగుకు విడుతల వారీగా నీటిని విడుదల చేసి రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తునట్లు తెలిపారు. జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు తాడెపు సోములు తదితరులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.

165
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...