జోరుగా.. హుషారుగా..


Wed,September 19, 2018 11:30 PM

-ఓటరు నమోదుకు ఉత్సాహంగా ముందుకొస్తున్న యువత
-జిల్లా వ్యాప్తంగా 58,611 కొత్త ఓటర్ల దరఖాస్తులు
-జిల్లాలో 8,11,053 మంది ఓటర్లు
-ఈ నెల 25 వరకు నమోదుకు తుది గడువు

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఓటర్ల నమోదుకు యువత ముందుకు వస్తున్నది. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు నమోదు చేసుకుంటున్నారు. ఈ నెల 15 నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఓటరు నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇందుకోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 25 వరకు ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగనున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 58,611 దరఖాస్తులు వచ్చాయి. ఎప్పటికప్పుడు వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. బుధవారం అన్ని మండలాల తహసీల్దార్లతో కలెక్టర్ కృష్ణభాస్కర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియపై నమస్తే తెలంగాణ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం..

జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాల పరిధిలో ఈ నెల 8న విడుదల చేసిన ఓటరు ముసాయిదా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 8,11,053 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 4,06,453 మంది పురుషులు, 4,04,543 మంది మహిళలు ఉన్నారు. 57 మంది ఇతరులు ఉన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పురుషులు 1,05,844, మహిళలు 1,05,304, ఇతరులు 10 మంది మొత్తం 2,11,158 మంది ఓటర్లు ఉన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో పురుషులు 99,337, మహిళలు 98,557, ఇతరులు 10 మంది మొత్తం 1,97,920 మంది, దుబ్బాక నియోజకవర్గంలో పురుషులు 90,094, మహిళలు 91,692, ఇతరులు 10 మంది మొత్తం 1,81,796 మంది ఓటర్లు ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో పురుషులు 1,11,178, మహిళలు 1,08,990, ఇతరులు 11 మంది మొత్తం 2,20,179 మంది ఓటర్లు ఉన్నారు. కాగా జిల్లాలో మద్దూరు, చేర్యాల, కొమురవెల్లి మండలాలు జనగామ నియోజకవర్గ పరిధిలోకి, బెజ్జంకి మండలం మానకొండూరు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఈ మండలాల ఓటర్ల సంఖ్య ఆయా నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. జనవరి 2018 వరకు 18 ఏండ్లు నిండిన వారందరు కూడా ఈ నెల 25 లోపు కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది.

58,611 దరఖాస్తులు స్వీకరణ
ఈ నెల 15 నుంచి 18 వరకు ఆయా నియోజకవర్గాల్లో 58,611 దరఖాస్తులను స్వీకరించి డిజిటలైజ్‌డ్ చేశారు. వీటిలో 5 వేల దరఖాస్తులను తిరస్కరించగా, 39,200 దరఖాస్తులను సరైనవిగా ధ్రువీకరించారు. మిగతావి పరిశీలనలో ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా హుస్నాబాద్‌లో 16,061 దరఖాస్తులు రాగా, సరైనవి 11,877, సిద్దిపేటలో 11,253 దరఖాస్తులు రాగా సరైనవి 6,187, దుబ్బాక నియోజకవర్గంలో 11,039 దరఖాస్తులు రాగా, సరైనవి 6,913, గజ్వేల్ నియోజకవర్గంలో 20,258 దరఖాస్తులు రాగా 14,223 సరైనవిగా ధ్రువీకరించారు. మిగతావి పరిశీలనలో ఉన్నాయి. వచ్చిన దరఖాస్తుల్లో ఫారం - 6 కింద 49,434 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 34,770 దరఖాస్తులు సరైనవిగా ధ్రువీకరించి, 4,335 తిరస్కరించారు. ఫారం - 7 కింద 6,602 దరఖాస్తులు రాగా, 4,121 దరఖాస్తులు సరైనవిగా ధ్రువీకరించి 169 తిరస్కరించారు. ఫారం - 8 కింద 2,203 దరఖాస్తులు రాగా 269 సరైనవిగా గుర్తించి 474 దరఖాస్తులను తిరస్కరించారు. ఫారం -8ఎ కింద 372 దరఖాస్తులు రాగా 40 సరైనవిగా గుర్తించి 22 తిరస్కరించారు.

ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలి
కలెక్టర్ కృష్ణభాస్కర్
జిల్లాలో ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ తహసీల్దార్లకు సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల మ్యాన్‌వల్ ప్రకారం అధికారులు వివరించాలని, ఓటరు నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల జాబితాలు రాష్ట్ర స్థాయి నుంచి ఈఆర్‌వో నెట్ 2.0 వెబ్‌సైట్‌కు అనుసంధానమై అంతర్జాలం ద్వారా ఢిల్లీకి చేరాయన్నారు. ఓటర్ల జాబితాలో తప్పొప్పులు లేకుండా పకడ్బందీగా రూపొందించాలన్నారు. ప్రతి గ్రామంలో ఓటరు నమోదుపై కళాకారులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈవీఎం గోదాము, ఎఫ్‌ఎల్‌సీ హాల్‌ను పరిశీలించిన కలెక్టర్ సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈవీఎం గోదామును, ఎఫ్‌ఎల్‌సీ హాల్‌ను జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, జాయింట్ కలెక్టర్ పద్మాకర్‌లు పరిశీలించారు. ఈవీఎం గోదాములో ఏర్పాట్లను కలెక్టర్‌కు డీఆర్‌వో చంద్రశేఖర్ వివరించారు.

దరఖాస్తు ఇలా ...
-కొత్త ఓటరుగా నమోదు చేసుకునుటకు ఫారం -6
- విదేశాల్లో ఉన్న వారు ఓటరు నమోదుకు ఫారం - 6 ఎ
- అనర్హుడైన ఓటరును తొలిగించుటకు ఫారం -7
- ఫారం -8 ద్వారా ఓటరు కార్డులో తప్పుల సవరణ
-ఫారం - 8ఎ లో నియోజకవర్గంలో ఒక పోలింగ్
-కేంద్రం నుంచి మరొక పోలింగ్ కేంద్రం మార్పు కోసం

250
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...