మహిళలు పోషక ఆహారం తీసుకోవాలి


Wed,September 19, 2018 11:27 PM

కొమురవెల్లి : పోషణలోప రహిత తెలంగాణ లక్ష్యమని స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిద్దిపేట, జనగామ జిల్లాల కో ఆర్డినేటర్ బూర విజయ అన్నారు. బుధవారం కొమురవెల్లి మండల కేంద్రంలో స్థ్ధానిక టీటీడీ కల్యాణమండపంలో సీడీపీవో సంతోషిబాయి అధ్యక్షతన పోషక ఆహారంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బూర విజయ మట్లాడుతూ.. మహిళలందరూ పోషక ఆహారం తీసుకోవాలని సూచిం చారు. ప్రతి అంగన్‌వాడీ టీచర్ బాధ్యతతో పనిచేయాలన్నారు. షోషణ అభియాన్ అనేది కేవలం కార్యక్రమం కాదని, ప్రజలందరి భాగస్వామ్యంతో విజయవంతం అవుతుందన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ప్రభుత్వం అనేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. పిల్లలకు వయస్సుకు తగ్గ బరువుతోపాటు బరువుకు తగ్గ ఎత్తు ఉండాలన్నారు. ఇంటింటికీ అంగన్‌వాడీ కార్యక్రమం చేపట్టి విస్తృత ప్రచారం చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వాళ్లంతట వాళ్లు వచ్చే విధంగా చైతన్య పర్చాలని సూచించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు తయారుచేసిన పోషక ఆహారాన్ని పరిశీలించారు. అనంతరం 11 మంది గర్భిణులకు సాముహిక సీమంతాలతో పాటు ముగ్గురు చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వెల్ఫెర్ అధికారి జరీనాబేగం, హెచ్‌వో రుక్మారెడ్డి, శాంతిసేన గ్రామీణాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు చంటి, అంగన్‌వాడీ సుపర్‌వైజర్లు కరుణశ్రీ, అదిలక్ష్మి, రేణుక, పద్మ, టీచర్లు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్ఠిక ఆహారం..
నంగునూరు : మండలంలోని రాంపూర్‌లో నిర్వహించిన పోషకాహార వారోత్సవాల్లో హెచ్‌ఈవో లింగమూర్తి, వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్‌లు పాల్గొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ప్రభుత్వం పోషకాహారం అందజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ మహేందర్‌గౌడ్, అంగన్‌వాడీ సిబ్బంది రేణుక, ఆశ వర్కర్ రాధ, నేతలు అనగోని పర్శరాములుగౌడ్, ఎల్లయ్య పాల్గొన్నారు.

151
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...