హరితహారం కూలీ చెల్లింపుల్లో జిల్లా రెండో స్థానం


Wed,September 19, 2018 11:26 PM

-కలెక్టర్ కృష్ణ భాస్కర్
- అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతే సేవ
- బతుకమ్మ చీరల పంపిణీకి కసరత్తు..
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : హరితహారంలో మొక్కలు నాటిన ఉపాధి హామీ కూలీలకు చెల్లింపులు చేయడంలో జిల్లా రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉందని కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో జేసీ పద్మాకర్, డీఆర్‌వో చం ద్రశేఖర్, ట్రైనీ కలెక్టర్ అవిశ్వాంత్ పండాతో కలిసి జిల్లాలో ఓ టర్ల నమోదు ప్రక్రియ, హరితహారం, బతుకమ్మ చీరలు తదిత ర అంశాలపై అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీ డియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ హరితహారంలో మొక్కలు నాటిన కూలీలకు చె ల్లింపులు చేయడంలో జిల్లా 2వ స్థానంలో నిలువడం పైపీడీవోలను అభినందించారు. హరితహారం టార్గెట్‌ను పూర్తి చేయని మద్దూరు, చేర్యాల, జగదేవ్‌పూర్ ఎంపీడీవోలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రణాళికబద్ధంగా ఎంపీడీవోలంతా హరితహారంపై శ్రద్ధ చూపాలన్నారు. గ్రామీణ ప్రా ంతాల్లో తాగునీరు, పారిశుధ్యం నిర్వహణపై ఫిర్యాదులు వస్తున్నాయని, ఆయా గ్రామాలకు చెందిన ప్రత్యేకాధికారులు తప్పనిసరిగా గ్రామాలకు వెళ్లాలన్నారు. ప్రత్యేకాధికారులు గ్రామాన్ని సందర్శించిన తరువాతనే ఎంపీడీవోకు రిపోర్టు చేయాలన్నారు. లేని పక్షంలో తనకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. బతుకమ్మ పండుగ దృష్ట్యా ఏ ర్పాట్లలో ఇబ్బందులు రావొద్దని, ప్రతి గ్రామంలోని చెరువుల వద్ద బతుకమ్మ ఘాట్‌ను ఏర్పాటు చేయాలన్నారు.

బతుకమ్మ చీరల పంపిణీ సాఫీగా..
బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం మహిళలకు పంపిణీ చేసిన బతుకమ్మ చీరల పంపిణీ సాఫీగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అక్టోబర్ మొదటి వారంలో చీరల పంపిణీకి జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తుందని జాయింట్ కలెక్టర్ వివరించారు. చీరల పంపిణీకి ముందుగానే టోకెన్లు ఇచ్చి క్యూపద్ధతిలో జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాకు 3 లక్షల 15 వేల లక్ష్యం ఉండగా ఇప్పటికే జిల్లాలో సిద్దిపేటలో 44 వేలు, గజ్వేల్‌లో 72 వేలు, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లలో 75 వేల చీరలను నిల్వ ఉంచామన్నారు. ప్రతి రోజు సాయంత్రం లోపు చీరల పంపిణీ వివరాలను అధికారులు తమకు పంపాలని సూచించారు.

అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతే సేవ
మహాత్మగాంధీ 150వ జయంతి పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ మిషన్ చేపట్టి 4 సంవత్సరా లు పూర్తయినందున అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతే సేవ కార్యక్రమం ద్వారా ప్రజలకు పారిశుధ్యం పై విస్తృత అవగాహన కల్పించడం ద్వారా స్వ చ్ఛ భారత్ కళ నిజం చేసేందుకు అవగాహన కా ర్యక్రమాల్లో భాగంగా గ్రామాల్లో శ్రమదానం చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. చెత్త సేకరణ, తడిపొడి చెత్త ద్వారా సేంద్రీయ ఎరువుల తయారీ, ఇంకుడు గుంతలు వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతే సేవ బ్యానర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నవీన్, పంచాయతీ అధికారి సురేశ్‌బాబు, వ్యవసాయ అధికారి శ్రావణ్, మత్స్యశాఖ అధికారి వెంకయ్య పాల్గొన్నారు.

140
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...