తండాల్లో గుబాళిస్తున్న గులాబీ


Wed,September 19, 2018 12:57 AM

-పల్లె, పట్టణం తేడా లేకుండా సాదరస్వాగతం
-అభివృద్ధికి పట్టం కట్టాలన్నానారాయణ్‌ఖేడ్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి
-ఓటు అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కే ఉందన్న పటాన్‌చెరు అభ్యర్థి మహిపాల్‌రెడ్డి
నమస్తే తెలంగాణ నెట్‌వర్క్:ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తండాలు, గ్రామాలు తేడాలేకుండా ఎక్కడికెళ్లినా సాదర స్వాగతం పలుకుతున్నారు. అభివృద్ధిలో దేశంలోనే అందరికంటే వేగంగా దూసుకుపోతున్నామని, ఇదే జోరు కొనసాగాలంటే కారు గుర్తుకే ఓటేస్తామని చెబుతున్నారు. గ్రామపంచాయతీలుగా మారిన గ్రామాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు గిరిజనులు మంగళహారతులు పడుతున్నారు. మీ వెంటే మేముంటామని నినాదాలు చేస్తున్నారు. మంగళవారం నారాయణఖేడ్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి కల్హేర్, సిర్గాపూర్‌లలో ప్రచారం నిర్వహించారు. పటాన్‌చెరులో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

గజ్వేల్‌రూరల్: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో తహసీల్దార్ ఆధ్వర్యంలో మంగళవారం 3కే రన్ నిర్వహించారు. ప్రజ్ఞాపూర్‌లోని ఏసీపీ కార్యాలయం వద్ద 3కేరన్‌ను కలెక్టర్ కృష్ణ భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్‌తో పాటు జేసీ పద్మాకర్, గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ భాస్కర్, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి తదితరులు యువకులతో కలిసి పరుగులు తీశారు. రన్‌లో అందరూ వెనుకపడగా, కలెక్టర్ కృష్ణ భాస్కర్ యువకులతో సమానంగా పరుగులు తీశారు. రన్ మధ్యలో ఏ మాత్రం అలసిపోకుండా ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ వరకు 3కిలోమీటర్ల రన్‌ను పూర్తి చేశారు. అనంతరం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. స్వచ్ఛమైన పాలన అందించే, నీతి నిజాయితీ గల నాయకుడిని ఎంచుకోవడానికి ప్రజలంతా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు నమోదు కోసం ప్రజల్లో అవగాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా నిర్వహించిన 3కే రన్‌కు యువత స్పందించి భారీ సంఖ్యలో హాజరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఓటరుగా నమోదు చేసుకోవడానికి, బదిలీ చేసుకోవడానికి రాజ్యాంగం అవకాశం కల్పించిందని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి గజ్వేల్ నియోజకవర్గంలో ఉంటున్న వారంతా స్థానిక తహసీల్దార్, బీఎల్‌వోలను సంప్రదించి గానీ, ఆన్‌లైన్‌లో గానీ 6,7,8ఫారాల్లో వివరాలు నమోదు చేసి అధికారులకు అందజేయాలన్నారు. యువకులు తమ కుటుంబంలోని ప్రతి 18సంవత్సరాలు నిండిన వ్యక్తిని ఓటరుగా నమోదు చేయించాలన్నారు. మున్సిపల్ చైర్మన్ భాస్కర్, జేసీ పద్మాకర్, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలంతా ఓటును నమోదు చేసుకుని ప్రజాస్వామ్య వ్యవస్తను పటిష్టం చేయాలన్నారు. ముగింపు సభలో సినీ హీరో సంపూర్ణేష్‌బాబు పాల్గొని యవతలో మరింత ఉత్సాహాన్ని నింపారు. యువత ఓటు నమోదు చేసుకుంటారా అని ప్రశ్నించగానే తప్పకుండా నమోదు చేసుకుంటామంటూ సమాధానం ఇవ్వడంతో సభలో నూతనోత్సాహం కనిపించింది. 3కే రన్‌లో సం గాపూర్ మదర్సా పాఠశాలకు చెందిన ఎండీ సలీం ప్రథమ స్థానంలో నిలువగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎల్లం, మల్లేశంలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు కలెక్టర్ కృష్ణ భాస్కర్ మెడల్స్, ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు.

147
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...