వొడితెలకు జన నీరాజనం


Wed,September 19, 2018 12:56 AM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: హుస్నాబాద్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్‌కు గ్రామాల్లో జనం నీరాజనం పడుతున్నారు. మూడు రోజుల క్రితం ప్రచారం ప్రారంభించిన ఆయన నియోజకవర్గంలోని కోహెడ, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకు అచ్చొచ్చిన వరంగల్ అర్బన్ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం జగన్నాథపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సతీశ్‌కుమార్ ఇదే మండలంలోని జీల్గుల తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కోహెడ మండలంలోని పరివేద, నకిరెకొమ్ముల, కోహెడ మండల కేంద్రంలోనూ ప్రచారం చేశారు. మంగళవారం వరంగల్ అర్బన్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం కొప్పూరులో గల పంచముఖ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. పలు గ్రామాల్లో టీఆర్‌ఎస్ కారు గుర్తుకే మా ఓటని ప్రజలు ఏకగ్రీవ తీర్మాణాలు చేసుకుంటున్నారు. వృద్దులు, చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ, పథకాలను వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని టీఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రచారంలో కరీంనగర్ జడ్పీవైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరిలతో పాటు ఆయా మండల పార్టీల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

191
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...