ఓటర్ నమోదుకు స్పందన


Wed,September 19, 2018 12:56 AM

కోహెడ: కోహెడ మండలంలో నిర్వహిస్తున్న ఓటర్ నమోదు కార్యక్రమానికి స్పందన లభిస్తుందని తహసీల్దార్ ఎస్‌కె. అరీఫా అన్నారు. మంగళవారం కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మండలంలో ఇప్పటి వరకు 398 నూతన ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారని ఆమె తెలిపారు. మండల పరిధిలో 50 పోలింగ్ బూత్‌లు ఉన్నాయని ఆమె తెలిపారు. అలాగే పురుషులు15వేల 914 ఓటర్లు, స్త్రీలు 15వేల 882 ఓటర్లు ఉన్నారన్నారు. ఈనెల 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. మిగిలిన వారు 25లోగా నమోదు చేసుకొని ఓటు హక్కును పొందాలని ఆమె అన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో విస్తృత స్ధాయిలో ప్రచారం చేశామన్నారు. ఎన్నికల కమిషన్ అదేశాల మేరకు నూతన ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...