విద్యుత్ కార్మికుల సంబురాలు


Wed,September 19, 2018 12:56 AM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: చాలాకాలంగా విద్యుత్ శాఖలో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న కార్మికులను రెగ్యులరైజ్ చేయడంలో ఎలాంటి తప్పిదాలు లేవని హైకోర్టు తీర్పునివ్వడంతో హుస్నాబాద్ ప్రాంత విద్యుత్ కార్మికుల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. హుస్నాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం విద్యుత్ కార్మికులు టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత సంవత్సరం జూలై 29న రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 23,667మందిని విద్యుత్ శాఖలో విలీనం చేస్తూ జీవో జారీ చేసిందన్నారు. ఈ జీవోను వ్యతిరేకిస్తూ కొందరు కోర్టుకు వెళ్లారన్నారు. కార్మికులకు అనుకూలంగా కోర్టు తీర్పును ఇవ్వడంతో వందలాది కార్మికుల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతున్నదన్నారు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రెగ్యులరైజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ డివిజన్ అధ్యక్షుడు గొర్ల కుమార్‌యాదవ్, కార్యదర్శి బాబూరావు, రమేశ్, శంకర్, సాంబరాజు, సంపత్, అశోక్, కుమార్, రంజిత్, శ్రీనివాస్, సురేశ్, పరంధాములు, వాసు తదితరులు పాల్గొన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...