ఆధునిక టెక్నాలజీతో గణేశ్ మండపాల భద్రత


Wed,September 19, 2018 12:55 AM

సిద్దిపేట టౌన్ : సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ గణేశ్ మండపాలకు భద్రత కల్పిస్తున్నారు. జిల్లాలో 2803 వినాయక మండపాలను ఉత్సవ నిర్వాహకులు నెలకొల్పారు. వీటి భద్రతకు జియో ట్యాగింగ్ ద్వారా గూగుల్ మ్యాప్‌కు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. టెక్నాలజీ ఆధారంగా తొలిసారి సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న గణపతి నవరాత్రులకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ప్రతి వినాయక మండపం వద్దకు పోలీసులు వెళ్లి, గణపతి విగ్రహాలను జియో ట్యాగింగ్ ద్వారా గూగుల్ మ్యాప్‌లకు అనుసంధానం చేస్తూ పర్యవేక్షిస్తున్నారు. విగ్రహాల వద్ద బ్లూకోర్ట్స్, పెట్రోలింగ్ పోలీసు సిబ్బంది వెళ్లి విగ్రహాలను ప్రతిష్ఠించిన ప్రదేశం, ఏర్పాటు చేసిన వ్యక్తులు, ఫోన్‌నంబర్లతో కూడిన పూర్తి సమాచారం సేకరించి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. దీంతో పోలీస్‌స్టేషన్ల వారీగా ఏర్పా టు చేసిన విగ్రహాల ఏర్పాటు, ప్రదేశాలను గూగుల్ మ్యాప్ ద్వారా గుర్తిస్తున్నారు. ప్రధానంగా జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించబడిన విగ్రహాలకు భద్రత కల్పించడంలో పోలీసుల పని సులభమవుతుంది. పెట్రోలింగ్ సిబ్బందితోపాటు బ్లూకోర్ట్స్ సిబ్బంది వద్ద ఉన్న ట్యాబ్‌లో నిక్షిప్తమైన వినాయక విగ్రహాల సమాచారం ఆధారంగా పోలీసు సిబ్బంది తమ పరిసరాల్లో ఉన్న మండపాల ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తూ భద్రత పటిష్టపరుస్తున్నారు. భవిష్యత్తు రోజుల్లో వినాయక విగ్రహాలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించడంలో వినియోగపడుతుందని పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ వివరించారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...