లక్ష మెజార్టీతో గెలిపించుకుంటాం : ఆస రాజశేఖర్


Wed,September 19, 2018 12:55 AM

దుబ్బాక టౌన్ : మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డిని వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని టీఆర్‌ఎస్వీ పట్టణ అధ్యక్షుడు ఆస రాజశేఖర్ అన్నారు. దుబ్బాకలో ఆయన మా ట్లాడుతూ.. రామలింగారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. దుబ్బాకలో ప్రజలను కొందరు నాయకులు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న రామలింగన్నను భారీ మెజార్టీతో గెలిపించడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ మండల ఉపాధ్యక్షుడు దిలీప్, ప్రధాన కార్యదర్శి బి.పరుశరాం, నాయకులు సాగర్, భానుచందర్ పాల్గొన్నారు.

అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్‌ఎస్ ధ్యేయం
రాయపోల్ : అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే టీఆర్‌ఎస్ ధ్యేయమని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు దౌల్తాబాద్ మండల శ్రీనివాస్‌గౌడ్, మర్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పడకంటి శ్రీనివాస్ అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేసిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ , టీడీపీలు మహాకుటమిగా ఏర్పాడడం సిగ్గుచేటని వివర్శించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్ధి సోలిపేట రామలింగారెడ్డి ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గెలుపోందడం ఖాయమని వారు పేర్కొన్నారు.

145
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...