యాదాద్రిలో భక్తుల సందడి..


Thu,September 13, 2018 12:27 AM

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో బుధవారం భక్తుల పూజల సందడి నెలకొంది. పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసి అర్చనలు జరిపారు. అనంతరం లక్ష్మీనరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి శ్రీ సుదర్శన హోమం, శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం, అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్తరంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రతిరోజు ఒక్కో రకమైన పూజలు నిర్వహిస్తూ భక్తులు లక్ష్మీనృసింహుడిని కొలుస్తున్నారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. రూ. 100 టిక్కెట్‌పై బాలాలయం ముఖ మండపంలో 10 నిమిషాలపాటు పూజలో పాల్గొనే ఈ పూజలకు ఆదరణ పెరుగుతున్నది. కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి.

శ్రీవారి ఖజానాకు రూ. 4, 81, 279 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 4, 81, 279 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 34, 528, 100 రూపాయల టిక్కెట్‌తో రూ. 12, 200, కళ్యాణకట్ట ద్వారా రూ. 20 వేలు. వ్రత పూజల ద్వారా రూ. 33, 500, గదులు విచారణ శాఖతో రూ. 27, 320, ప్రసాదవిక్రయాలతో రూ. 2, 54, 430, శాశ్వత పూజలతో రూ. 1, 116తో పాటు అన్ని విభాగాల ద్వారా శ్రీవారి ఖజానాకు రూ. 4, 81, 279 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...