బానిసలవుతున్నారు.!


Thu,September 13, 2018 12:26 AM

మఠంపల్లి : అరచేతుల్లో ప్రపంచంలోని వింతలు విశేషాలు చూపే అంతర్జాలంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. కానీ యువత, విద్యార్థుల్లో వినియోగంపై సరైన అవగాహన లేకపోవడంతో బానిసలై దుష్ప్రబావాలకు లోనవుతున్నారు. అడగ్గానే పిల్లలకు కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు కొనిస్తున్న తల్లిదండ్రులు పిల్లలు వాటిని వినియోగిస్తున్నప్పుడు కనీస పర్యవేక్షణ ఉంచకపోవడంతో అశ్లీలం వైపునకు ఆకర్షితులవుతున్నారు. తెలియని తనంతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

తేలికగా అంతర్జాలం సేవలు..
ప్రస్తుతం అంతా స్మార్ట్‌యోగం కొనసాగుతుంది. పాఠశాల స్థ్ధాయిలోనే బాలురు, బాలికలు చేతికి స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయి. ఇక అంతర్జాలం కూడా తక్కువే ధరకే అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్ధలు పలు ప్రాంతాల్లో వైఫై సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అయితే వీటిని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా కౌమార దశ నుంచి యుక్త వయస్సులోకి అడుగుపెట్టే విద్యార్థులు అశ్లీలం వైపు ప్రభావితం అవుతున్నారని నిపుణులు అంటున్నారు. స్నేహితులతో కలిసి అశ్లీల చిత్రాలు చూస్తు తమకు తెలియకుండానే వాటికి బానిసలుగా మారుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం చదువులోనూ అంతర్జాల వినియోగం తప్పనిసరిగా మారిం ది. వివిధ పాఠ్యాంశాలల్లో విషయ పరిజ్ఞానం, ప్రాజెక్ట్ వర్క్స్ , హోంవర్క్స్ కోసం అంతర్జాలంలో శోధించాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచిస్తున్నారు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రుల సాయంతోపాటు ఇతరుల సాయంతో అంతర్జాలాన్ని చూస్తున్నారు. ఈ సమయంలో వారు ఎలాంటి వెబ్‌సైట్లు చూస్తున్నారనే విషయం తల్లిదండ్రులు గమనించడం లేదు. తల్లిదండ్రులు దగ్గరగా పిల్లలను గమనిస్తే ముందుగానే వారిని కాపాడవచ్చని చెబుతున్నారు. ప్రతీరోజు వారితో కొంతసేపు గడపడం వారేం చేస్తున్నారో తెలుసుకోవడం ద్వారా ఇలాంటి వాటి నుంచి పిల్లలను దూరంగా చేయడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం మారిన జీవన విధానంలో తల్లిదండ్రులు పిల్లలతో గడపడానికి అవకాశం చిక్కకుండా పోతుంది.

తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం..
కొందరు తల్లిదండ్రులు పిల్లలపై అతి ప్రేమ చూపుతూ వారు ఏం చేసినా సమర్థించే ధోరణి పెరుగింది. ఇటీవల నగరంలో సంచలనం సృష్టించిన మత్తుపదార్థాల వినియోగం కేసులో బాలురు, బాలికలు డ్రగ్స్ వాడుతున్నట్లు పోలీసులు వారి తల్లిదండ్రులు దృష్టికి తీసుకెళ్ళినా పెద్దగా స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి పాఠశాల స్థాయిలో విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు అంతర్జాలం అవసరం ఉందా.? అనేది ప్రశ్నార్థకం. పిల్లలు అడిగారనో..లేక సామాజిక హోదాకు గుర్తుగా అవసరం లేకపోయినా వారికి స్మార్ట్‌ఫోన్లు కొనిస్తున్న తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో కొంత మంది అశ్లీలానికి బానిసలుగా మారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి వాటిని చూడటానికి అలవాటు పడిన వారి ప్రవర్తనలో మార్పులు గమనించవచ్చని వ్యక్తిత్వ వికాస నిపుణులు

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...