పచార హోరు.. గులాబీ జోరు..


Wed,September 12, 2018 11:49 PM

-ఆశీర్వదించండి..అండగా ఉంటా..
అందోల్, నమస్తే తెలంగాణ : అహంకారానికి... ఆత్మగౌరవానికి మధ్య పోరాటాం.. ఓ సాధారణ జర్నలిస్టుని.. ఉమ్మడి రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తిపై పోరు.. ఆశీర్వదించండి.. అండగా ఉంటా.. అని టీఆర్‌ఎస్ పార్టీ అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ అందోల్ నియోజకవర్గ ప్రజలను కోరారు. బుధవారం జోగిపేటలోని శ్రీరామ ఫంక్షన్ హాల్‌లో మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ పి.జైపాల్‌రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గస్థాయి టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. అందోల్‌లో పార్టీ కార్యాలయాన్ని క్రాంతి కిరణ్ ప్రారంభించారు. అనంతరం హౌజింగ్ బోర్డు నుంచి బైకుపై ర్యాలీగా బయలుదేరి, బస్వవేశ్వర విగ్రహానికి, క్లాక్ టవర్‌లోని గాంధీజీ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ర్యాలీలో కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాల్లి, జై స్థానికం...జై జై స్థానికం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఏంఎస్ చైర్మన్ సిద్దన్నపాటిల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు డీబీ నాగభూషణం, కమ్రొద్దీన్, యేసయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు లింగాగౌడ్, జగన్మోహన్‌రెడ్డి, మండల కో ఆర్డినేటర్ వర్కల అశోక్, జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, జోగిపేట పట్టణ అధ్యక్షుడు చాపల వెంకటేశం, అందోల్, పుల్కల్, రాయికోడ్, మునిపల్లి, టేక్మాల్, వట్‌పల్లి, రేగోడు, అల్లాదుర్గం పార్టీ మండలాల అధ్యక్షులు లక్ష్మీకాంత్‌రెడ్డి, గోవర్ధన్, విఠల్, అల్లం నవాజ్‌రెడ్డి, యూసూఫ్, వీరారెడ్డి, వినోద్, సుభాశ్‌రావు, మున్సిపల్ కౌన్సిలర్లు అల్లె శ్రీకాంత్, పులుగు గోపాల్‌రావు, పిట్ల లక్ష్మణ్, గాజుల నవీన్‌కుమార్, సీనియర్ నాయకులు రమేశప్ప, సాయికుమార్, మల్లికార్జున్ పాటిల్, శ్రీనివాస్‌రెడ్డి, సంగమేశ్వర్‌గౌడ్, కాశీనాథ్, నర్సింహారెడ్డి, వీరప్ప, ప్రభాకర్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, అశోక్, బస్వరాజ్, ఖాజాపాష, నరేందర్‌గౌడ్, సురేందర్‌గౌడ్, సుధాకర్, అల్లె గోపాల్, గోరే, అశోక్, శంకర్‌యాదవ్, మహేశ్‌యాదవ్, అనిల్‌రాజ్, రవీందర్‌గౌడ్, జాగృతి నాయకులు ఎండీ ఫైజల్, నాగరాజు, మారుతి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మహిపాలుడికే మద్దతు..
పటాన్‌చెరుటౌన్ : టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మహిపాల్‌రెడ్డికే మద్దతు ఇస్తామంటూ టీఆర్‌ఎస్ పట్టణ విభాగంతోపాటు, పలు మహిళా సంఘాలు ప్రతినబూనాయి. బుధవారం పటాన్‌చెరులోని ముదిరాజ్ భవనంలో, పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బాయికాడి విజయకుమార్ ఆధ్వర్యంలో క్రియాశీల నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మెట్టు కుమార్ యాదవ్, నర్ర భిక్షపతి మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గాన్ని రూ.4,300 కోట్ల నిధులతో అభివృద్ధి పరిచిన మహిపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. ఈ సమావేశంలో షకీల్ లడ్డూ, ఇమ్రాన్, వంగరి అశోక్, తులసీదాస్, శ్రీనివాస్ రెడ్డి, నాగసాని సత్తయ్య, వినోద్‌రెడ్డి, జయశ్రీ, గుండమోళ్ల రాజు, హాషం, కొండల్, విద్యాసాగర్, వెంకటేశ్, సందీప్, శ్యాం తదితరులు పాల్గొన్నారు.

మద్దతు పలికిన మహిళలు...
అమీన్‌పూర్ మండలంలోని ఎన్‌ఆర్‌ఐ కాలనీ మహిళలు బుధవారం గూడెం మహిపాల్‌రెడ్డి స్వగృహంలో ఆయన సతీమణి యాదమ్మను స్రవంతి, భవాని, తులసీ, శిరీష, విశాలాక్షి, ప్రసన్న, శ్రీపద్మ, సాయిప్రసన్న తదితరులు కలిసి తమ మద్దతును ప్రకటించారు.

పద్మక్కకు నీరాజనం..
మెదక్ ప్రతినిధి, మెదక్, నమస్తే తెలంగాణ : మెదక్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి బుధవారం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముందుగా చిన్నశంకరంపేట మండలంలోని అమరవీరుల స్థూపం వద్ద టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా పార్టీ ఇన్‌చార్జి వేలేటి రాధాక్రిష్ణశర్మలతో కలిసి అమరవీరులకు నివాళులర్పించారు. సంకాపూర్ గిరిజన తండాకు చెందిన నాయకుడు తలపాగా చుట్టి ఖడ్గాన్ని బహూకరించారు. పటాకులు కాల్చుతూ.. డప్పు చప్పుళ్లతో పద్మాదేవేందర్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ బైక్ ర్యాలీ చిన్నశంకరంపేట నుంచి అంబాజిపేట, గవ్వలపల్లి చౌరస్తా, కొర్విపల్లి గ్రామాల మీదుగా మెదక్ వరకు కొనసాగింది. మెదక్ క్యాంపు కార్యాలయంలో వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని, వేలాదిగా వచ్చిన పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీగా రాగా ఆమె ప్రచార రథంపై ఏడుపాయల వనదుర్గామాత సన్నిధికి చేరుకున్నారు. అనంతరం ఏడుపాయల వనదుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. మెదక్ చర్చిలో చర్చి గురువు సుశీల్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేయగా, డిప్యూటీ స్పీకర్ దంపతులను ఆయన దీవించారు.

మెదక్‌లో ఘన స్వాగతం..
టీఆర్‌ఎస్ అభ్యర్థిగా టికెట్ కేటాయించిన తరువాత మొదటిసారిగా బుధవారం మెదక్‌కు విచ్చేసిన పద్మాదేవేందర్‌రెడ్డికి నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు, పలు కుల సంఘాల నాయకులు వేలాది మంది తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు. దారి పోడవునా పటాకులు కాల్చి పద్మక్క జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున వినాదాలు చేశారు. అనంతరం భారీ బైక్ ర్యాలీగా వనదుర్గామాత దేవాలయానికి చైతన్యరథంపై తరలివెళ్లారు. ర్యాలీలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి రాధాకృష్ణశర్మ, జిల్లా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, నియోజకవర్గంలోని మెదక్, రామాయంపేట, పాపన్నపేట, చిన్నశంకరంపేట ఎంపీపీలు, జెడ్పీటీసీలు లక్ష్మీకిష్టయ్య, పుట్టి విజయలక్ష్మి, పవిత్రదుర్గయ్య, కర్రె కృపావతి, లావణ్యరెడ్డి, బిజ్జ విజయలక్ష్మిసంపత్, స్వప్నబాలాగౌడ్, స్వరూపరాణి, మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, ఏడుపాయల దేవస్థానకమిటీ చైర్మన్ పట్లోళ్ల విష్ణువర్ధన్‌రెడ్డి,వైస్ చైర్మన్ రాగి అశోక్, నియోజకవర్గంలోని రామాయంపేట, చిన్నశంకరంపేట, పాపన్నపేట, మెదక్ మండల, హవేళిఘనపూర్, నిజాంపేట, మెదక్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రమేశ్‌రెడ్డి, నర్సారెడ్డి, పట్లోరి రాజు, సాన సత్యనారాయణ, సుధాకర్‌రెడ్డి, అంజాగౌడ్, కిష్టయ్య, కిషన్‌గౌడ్, జయరాంరెడ్డి, హన్మంతరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ చల్ల నరేందర్, కౌన్సిలర్లు వెంకటరమణ, సలాం, మల్లేశం, శ్రీనివాస్, సులోచన, చంద్రకళ, విజయలక్ష్మి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు కృష్ణారెడ్డి, గంగ నరేందర్, ఆత్మ కమిటీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ జీవన్‌రావు, మండల నాయకురాలు ప్రభావతి, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు సరాఫ్ యాదగిరి, పుట్టి యాదగిరి, జితెందర్‌గౌడ్, కొండల్‌రెడ్డి, దేమే యాదగిరి, మెదక్ టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గంగాధర్, కృష్ణాగౌడ్, టీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ జీవన్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు లింగారెడ్డి, చింతల నర్సింలు, బాల్‌రాజ్, ప్రభురెడ్డి, సుధాకర్, గౌష్‌ఖురేషి, గోవింద్, సాయిలు, రాజు, రవి. జాయ్‌ముర్రే, అరవింద్‌గౌడ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరిక..
మెదక్ పట్టణానికి చెందిన పలు పార్టీల మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి టీఆర్‌ఎస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

వెల్దుర్తిలో ప్రచార ప్రభంజనం
వెల్దుర్తి : నర్సాపూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మదన్‌రెడ్డి బుధవారం మండలంలోని రామంతాపూర్‌లో ప్రచారం ప్రారంభించారు. ఉదయం మాసాయిపేట రుక్మిణీపాండురంగస్వామి, సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. రామంతాపూర్‌లోని మజీద్‌లో ప్రార్థనలు చేశారు. అనంతరం టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు జాతీయ రహదారి మీదుగా రామంతాపూర్, లింగారెడ్డిపల్లి, రామంతాపూర్ గిరిజన తండాల మీదుగా భారీ బైక్ ర్యాలీ తీశారు. ప్రచారానికి మదన్‌రెడ్డి వెంబడి వచ్చిన నాయకుల వాహనాల కాన్వాయ్ విశేషంగా ఆకట్టుకున్నది. మాసాయిపేట వద్ద బైక్ ర్యాలీని ప్రారంభించిన మదన్‌రెడ్డి రామంతాపూర్ వరకు బైక్‌పై రావడంతో యువకుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. పటాకులు కాల్చుతూ డప్పుచప్పుళ్లతో మదన్‌రెడ్డికి రామంతాపూర్ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసి, చౌరస్తాలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. భారీ ర్యాలీగా లింగారెడ్డిపల్లికి చేరుకుని గడపగడపకు తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రారంభం రోజు ప్రచారం ప్రభంజనంలా సాగింది.

155
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...