కారు గుర్తుకే మా ఓటు


Wed,September 12, 2018 11:48 PM

కలెక్టరేట్ నమస్తే తెలంగాణ : కారు గుర్తుకే ఓటు వేస్తాం అంటూ వివిధ కుల సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. బుధవారం సిద్దిపేట పట్టణంలోని 26 వార్డుకు చెందిన ప్రశాంత్‌నగర్‌కు చెందిన 400 కుటుంబాల రెడ్డిసంఘం సభ్యులు , పట్టణంలోని 800 గల స్వర్ణకారుల సభ్యులు అంతా సమావేశం అయి రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామంటూ తీర్మానం చేసి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఫారూక్ హుస్సేన్‌ల అందజేశారు. ఈసందర్భంగా వారు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా ప్రశాంత్‌నగర్ రెడ్డి సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేయడం హర్షణీయమన్నారు. సిద్దిపేటలో టీఆర్‌ఎస్‌ను లక్ష పై చిలుకు ఓట్ల మెజార్టీ తీసుకరావడానికి మనమంతా కృషి చేయాలన్నారు. రెడ్డి సంక్షేమ సంఘానికి హైదరాబాద్‌లో 15 ఎకరాల భూమి, రూ.10 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. ప్రశాంత్‌నగర్ రెడ్డి సంఘం అధ్యక్షుడు రెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. టీఆర్‌ఎస్ నాయకులు ధర్మవరం బ్రహ్మం ఆధ్వర్యంలో స్వర్ణకారులు టీఆర్‌ఎస్‌కు ఓటేస్తామంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్‌యాదవ్, రెడ్డి సంఘం సభ్యులు మల్లికార్జున్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, భగవాన్‌రెడ్డి, చంద్రారెడ్డి, మల్లారెడ్డి, గోవర్దన్‌రెడ్డి, పెరుడి వెంకట్‌రెడ్డి, చందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పన్యాల వెంకట్‌రెడ్డి, కుంభం మల్లారెడ్డి, ఎల్లు గోవర్ధన్‌రెడ్డి, నర్ర చంద్రారెడ్డి, మల్లారెడ్డి, మూర్తి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

142
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...