ఓటరు జాబితా సవరణకు రాజకీయ పార్టీలు సహకరించాలి


Wed,September 12, 2018 02:36 AM

-2018 జనవరి1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు
-15,16 తేదీల్లో ముసాయిదా జాబితా సవరణపై అభ్యంతరాల స్వీకరణ
-ఈ నెల 18న జిల్లాకు ఈవీఎంల రాక
-కలెక్టర్ సురేంద్రమోహన్
సూర్యాపేట, నమస్తే తెలంగాణ : శాసనసభ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా జాబితాలో ఈనెల 25 వరకు సరవణతో పాటుచేర్పులు, మార్పులు చేసుకునే వెసులుబాటు ఉందని దీనికి ప్రతీ ఒక్క రాజకీయ పార్టీ సహకరించాలని కలెక్టర్ సురేంద్రమోహన్ కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఈనెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఓటర్ల జాబితాలో చెర్పులు, మార్పులకు అవకాశం ఇవ్వ డం జరిగిందన్నారు. 2018 జనవరి 1వ తేదీ వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్లుగా పేరును నమోదు చేసుకోవాలని కోరారు.

ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఓటర్ల లిస్టు నుంచి పోలింగ్ కేంద్రాల వరకు అన్ని పారద్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నూతనంగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలో తొలి సారి జరుగుతున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలి పారు. అందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ముసాయిదా ఓటర్ల జాబితా సవరణ , అభ్యంతరాల స్వీకరణకు బూత్ లెవల్ అధికారులు ఈనెల 15,16 తేదీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటారని చెప్పారు. 25వ తేదీ వరకు ఓటర్ల నమోదు చేసుకోవడంతో పాటు ఫొటో మార్పు, చిరునామా మార్పుల, మరణించిన ఓటర్ల తొలగింపు వంటి సవరణలు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం ముద్రించిన ముసాయిదా జాబితాను గుర్తింపు పొందిన పార్టీలకు ఒక సెట్ ఇవ్వలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 18వ తేదీన సూర్యాపేట జిల్లాకు అవసరమైన వీవీప్యాడ్లు వస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్ (భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్) నుంచి రానున్నట్లు తెలిపారు. వీవీ ప్యాడ్ల పనితీరును నిఫుణులైన ఇంజినీరింగ్ బృందాలచే పరిశీలించడం జరుగుతుందన్నారు. జాయింట్ కలెక్టర్‌తో పాటు నలుగురు జిల్లా అధికారులు వాటి పనితీరును పర్యవేక్షించడం జరుగుతుందని చెప్పారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులకు వీవీ ప్యాడ్లపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయనున్నట్లు తెలిపారు. అందుకు వారికి ప్రత్యేకంగా ఒక రోజు సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశానికి నాలుగు రోజుల ముందే వారికి సమాచారం ఇస్తామని తెలిపారు. ఈవీఎంలు, వీవీ ప్యాడ్ల భద్రతను సీసీ కెమెరాలతోపాటు పోలీస్ బందో బస్తు నడుమ స్ట్రాంగ్ రూములో భద్రపరచనున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి. చంద్రయ్య, సూర్యాపేట ఆర్డీఓ మోహన్‌రావుతో పాటు వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...