రాబోయే ఎన్నికల్లో..టీఆర్‌ఎస్ అభ్యర్థులదే గెలుపు


Wed,September 12, 2018 02:36 AM

- గత ఎన్నికల హామీలన్నీ అమలయ్యాయి..
- ఎంపీ బూర నర్సయ్యగౌడ్, తాజా మాజీ ఎమ్మెల్యే కిశోర్
- తుంగతుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మద్దిరాల : రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని కుక్కడం గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన, టీఆర్‌ఎస్‌లో చేరిన పలువురు కాంగ్రెస్ నాయకులకు మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో కలిసి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన 60ఏండ్లలో కంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాలుగున్నరేండ్లలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. 2014ఎన్నికల్లో చెప్పిన హామీలు వందకు వందశాతం, చెప్పని ఎన్నో హామీలను అమలు చేసినట్లు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపిస్తాయని దీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో గాదరి కిశోర్‌కుమార్‌ను 40వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత టీఆర్‌ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. నియోజకవర్గంలో ప్రజాసేవ చేయడానికి మరోసారి అవకాశం వచ్చిందని, ప్రజలు తనను దీవించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గోరెంట్ల టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జక్కి వెంకటేశ్వర్లు కుటుంబానికి లక్ష్మీనరసింహస్వామి వృత్తిదారుల ప్రమాద బీమాలో మంజూరైన రూ.5లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్ ఎస్‌ఏ రజాక్, జడ్పీటీసీ నర్సింగ్‌నాయక్, వైస్‌ఎంపీపీ తొనుకునూరి లక్ష్మణ్ గౌడ్, గ్రంథాలయ కమిటీ డైరెక్టర్ దుగ్యాల రవీందర్‌రావు, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు మల్లు కపోతంరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బెజ్జెంకి శ్రీరాంరెడ్డి, జిల్లా నాయకులు కోడి శ్రీను, జీడి భిక్షం, సూరినేని నర్సింహారావు, అశోక్‌గౌడ్, ఎంపీటీసీలు భూసాని ఉమామహేశ్వర్, బర్పటి వెంకన్న, గుడ్ల వెంకన్న, తీగల వెంకన్న, కొలగాని వెంకన్న, బద్దం సంజీవరెడ్డి, శిరంశెట్టి అశోక్, పాతూరి లింగారెడ్డి, గోల్కొండ మల్లేష్, తొనుకునూరి రమేష్, గుడిపాటి సైదులు, గుండగాని రాములుగౌడ్, తాటికొండ సీతయ్య, నల్లు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

142
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...