కంటివెలుగు న్యాయవాదులకు ఉపయుక్తం


Wed,September 12, 2018 02:36 AM

రామగిరి : కంటివెలుగు శిబిరం న్యాయవాదులకు ఎంతో ఉపయుక్తమని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.తిమరుమల్‌రావు అన్నారు. మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఇందులో పరీక్షలు చేయించుకుని ఆయన మాట్లాడారు. కంటిచూపు బాగుంటేనే చేసే పనిలో రాణిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్జీలు వింధేశ్వరీ, మాధవీలత, కె.రాణి, బార్ అసోసియేషన్ బాధ్యులున్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...